ప్రధానిపై వ్యాఖ్య: ఎమ్మెల్యేకి షోకాజ్, నాదికాదని ట్విస్ట్
ముంబై: భారతీయ జనతా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజ్ పురోహిత్‌కు భారతీయ జనతా పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లపై వ్యాఖ్యలు చేసినందుకు షోకాజ్ నోటీసు ఇచ్చామని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు.
పార్టీలో సమష్టి బాధ్యత ఉండాలని చెబుతున్నారని, కానీ ఆచరణలో అది కనిపించడం లేదని, అధికారమంతా ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేతిలోనే ఉందని రాజ్ పురోహిత్ వ్యాఖ్యానించారు. ఇది భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తెస్తుందన్నారు.

మోడీ మంచి పనులు చేస్తున్నప్పటికీ కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహా సీఎం ఫడ్నవీస్ కూడా పైనుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని, ఆయన నిస్సహాయుడిగా ఉండిపోతున్నారని కూడా పురోహిత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ స్టింగ్ ఆపరేషన్లో పై వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఆ వీడియోలో ఉన్న గొంతు తనది కాదని ఎమ్మెల్యే చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపించి నిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications