• search

నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు: కీలక బిల్లులు, ఏకమైన ప్రతిపక్షాలు, టీడీపీ అవిశ్వాసం

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమై కత్తులు దూస్తున్న సమయంలో జరగనున్న ఈ సమావేశాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

   పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: ఏకమైన విపక్షాలు, కీలక బిల్లులపై చర్చ

   సంప్రదాయం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కూడా వాడిగావేడిగా సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు వాటి అజెండాలను ఆవిష్కరించాయి.

   BJP, Opposition set for showdown as Parliament session begins Today

   మహిళా రిజర్వేషన్‌, తక్షణ ముమ్మారు తలాక్‌/ నిఖా హలాలా పద్ధతుల నిషేధం, ఓబీసీ బిల్లుల్ని ఆమోదించుకోవడంలో సహకరించాలని కాంగ్రెస్‌ పార్టీకి కేంద్ర సర్కారు లేఖ ద్వారా కోరింది.

   ఈ పార్లమెంటు సమావేశాల్లో 46 బిల్లుల్ని చర్చించి ఆమోదించుకోవాలని అధికార పక్షం సమాయత్తమవుతోంది. తాము లేవనెత్తిన సమస్యలను పరిష్కరించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సభను జరగనీయకూడదని ప్రతిపక్షం సిద్ధమవుతోంది. మంగళవారం ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. సభ సజావుగా సాగడానికి అన్ని పక్షాలూ సహకరించాలని కోరారు.

   'సమావేశాలు ఉత్పాదకంగా సాగేలా పార్టీలన్నీ నిర్మాణాత్మక సహకారం అందించాలి. అంశాలపై చర్చించి సభ సజావుగా సాగేలా సహకరిస్తాయని నమ్ముతున్నా'అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అనంతకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. సభకు సహకరించాలని అన్ని పక్షాలకూ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

   పార్లమెంటు ఉభయ సభల ముందు మొత్తం 39 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 123 రాజ్యాంగ సవరణ బిల్లు, త్రిపుల్ తలాక్ బిల్లు, ట్రాన్స్‌జెండర్ భత్రద బిల్లు, జాతీయ వైద్య కమిషన్ బిల్లు, బాలబాలికల విద్యా హక్కు బిల్లులు ఉభయ సభల్లో చర్చకు పెట్టి ఆమోదం తీసుకునేందుకు ప్రయత్నిస్తామని అనంత కుమార్ తెలిపారు.

   'తెలుగుదేశం ప్రవేశపెట్టే అవిశ్వాసంతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్యను లేవనెత్తినా సమాధానం చెప్పడానికి సిద్ధమే' అని ఆయన స్పష్టం చేశారు. సభ జరిగితే ప్రతి అంశం చర్చకు వస్తుందని, దానికి సమాధానం కూడా దొరుకుతుందన్నారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   The government and the opposition appeared set for a showdown in Parliament's Monsoon Session beginning today(Wednesday) with the Congress pushing for a no-confidence motion while the BJP is likely to raise Rahul Gandhi's reported statement that his party "is for Muslims" to corner it.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more