బీజేపీ భయపడిపోతోంది, గుజరాత్ బీజేపీలో కీలక మార్పు అంటూ అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని చూసి భయపడిపోయిన బీజేపీ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు సిఆర్ పాటిల్‌ను త్వరలో తొలగిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు డిప్యూటీ మనీష్ సిసోడియాతో కలిసి గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు బయలుదేరిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. భావ్‌నగర్ నగరంలో విద్య, ఉపాధి సమస్యలపై యువతతో సంభాషించనున్నారు.
"గుజరాత్‌లో, ఆమ్ ఆద్మీ పార్టీని చూసి బీజేపీ చాలా భయపడుతోంది. జరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్‌ను త్వరలో తొలగించబోతున్నారు" అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.

రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య పోటీని మహాభారతం తరహాలో 'ధర్మయుద్ధం'గా నిలబెట్టాలని కేజ్రీవాల్ అన్నారు. ఇక్కడ పాలక సంస్థ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల 'సైన్యాన్ని' తన వైపు ఉంచింది. పార్టీకి "కృష్ణుడి మద్దతు" ఉంది అని అన్నారు.
బీజేపీని మహాభారతంలో ఓడిపోయిన విలన్‌లైన కౌరవులతో పోల్చిన అరవింద్ కేజ్రీవాల్.. హిందూ ఇతిహాసంలో విజేతలైన పాండవులుగా అతని వైపున్నవారిని పోల్చారు.
సబర్‌కాంత జిల్లాలోని హిమ్మత్‌నగర్ పట్టణంలో జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. బీజేపీ పాలిత గుజరాత్‌లో మార్పు కోసం తహతహలాడుతున్నారని, ఆప్‌కి ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించిందని పేర్కొన్నారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా నివాసంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేయడానికి ఇదే కారణమని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సిసోడియా ఇంటితోపాటు దేశంలోని 30 ప్రాంతాల్లో సీబీఐ శుక్రవారం దాడులు చేసింది.
ఈ కేసులో దర్యాప్తు కోసం ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రూవ్ ఏజెన్సీ సోర్స్ ఆధారిత ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. సిసోడియా, ఇతరులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది.












Click it and Unblock the Notifications