వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ ఫలితాల వేళ: బీజేపీ కార్యాలయానికి నిప్పు, టీఎంసీ గూండాల పనేనంటూ కాషాయ పార్టీ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే రాష్ట్రంలో విధ్వంసకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ విజయం దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మమతా బెనర్జీకి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి.. నందిగ్రాం నియోజకవర్గంలో తీవ్రమైన పోటీనే ఇచ్చారు.

కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. రాష్ట్రంలోని ఆరంబాఘ్‌లోని భారతీయ జనా పార్టీ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పుపెట్టి దహనం చేశారు. అయితే, బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టింది టీఎంసీ గూండాలేనని బీజేపీ నేత సంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ దాడిని ఖండించారు.

BJP party office burnt down in WBs Arambagh town- BJP blames TMC, but TMC denies

ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమేనని.. కానీ, ఇలాంటి విధ్వంసాలు చేయడం సరికాదని సంబిత్ పాత్ర హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని చంపేయకండి అని టీఎంసీని ఆయన కోరారు. అయితే, ఈ దాడికీ తమకూ ఎలాంటి సంబంధం లేదిన టీఎంసీ చెప్పడం గమనార్హం.

కాగా, నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి.. మమతా బెనర్జీకి గట్టిపోటీనే ఇచ్చారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు 1200 ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీ విజయం సాధించింది. చివరి రౌండ్ వరకు కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధిక్యతను చూపారు.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అధికార టీఎంసీకి 200లకుపైగా అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక బీజేపీకి 80కిపైగా స్థానాల్లో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి.

ఆరంబాగ్ తోపాటు బెలఘాట్ లో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. శివపూర్, దుర్గాపూర్, ఉత్తర బర్ధమన్ లో ఇలాంటి దాడులు జరిగాయని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు.

English summary
Violence breaks out in Bengal soon after the West BengalElections results were clear. BJP party office in Arambagh is set on fire. Allegation against TMC, TMC denies charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X