కేజ్రీవాల్‌పై వర్మ అస్త్రం

Arvind Kejriwal: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయమౌతుంది.

ఫిబ్రవరి రెండో వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడొచ్చు. సంక్రాంతి పండుగ తరువాత షెడ్యూల్ వెలువడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తోన్నారు.

BJP s Parvesh Verma to contest from New Delhi assembly seat against Arvind Kejriwal

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు.

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మందితో కూడిన జాబితా ఇది. ఇటీవలే పార్టీ ఫిరాయించిన ఆమ్ ఆద్మీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు టికెట్ ఖరారైంది. బిజ్వాసన్ నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు.

ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగిన న్యూఢిల్లీ స్థానంలో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను రంగంలోకి దింపింది బీజేపీ. కల్కాజీ- రమేష్ బిధూరి, ఆదర్శ్‌నగర్- రాజ్ కుమార్ భాటియా, బాదలి- దీపక్ చౌదరి, రిఠాలా- కుల్వంత్ రాణా, నాంగ్లోయి జాఠ్- మనోజ్ షోకీన్‌కు టికెట్లు లభించాయి.

పటేల్ నగర్ (ఎస్సీ)- రాజ్ కుమార్ ఆనంద్, రాజౌరి గార్డెన్- సర్దార్ మన్జీందర్ సింగ్ సిర్సా, జనక్‌పురి- ఆశీష్ సూద్‌, మంగళ్‌పురి (ఎస్సీ)- రాజ్ కుమార్ చౌహాన్, రోహిణి- విజేందర్ గుప్తా, షాలిమార్ బాగ్- రేఖా గుప్తా, మోడల్ టౌన్- అశోక్ గోయెల్, కరోల్ బాగ్ (ఎస్సీ)- దుష్యంత్ కుమార్ గౌతమ్‌ పేర్లు ఖరారయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+