జ‌మిలి ''రోడ్‌మ్యాప్'' సిద్ధం చేస్తున్న బీజేపీ! ఎన్నిక‌లు ఎప్పుడంటే..

2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదరదాస్ మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టినుంచి దేశ‌వ్యాప్తంగా పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, విదేశాల నుంచి న‌ల్ల‌డ‌బ్బు వెన‌క్కి తీసుకురావడంక‌న్నా ఎక్కువ చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశం ఏదైనా ఉందా? అంటే అది జ‌మిలి ఎన్నిక‌లు ఒక్క‌టే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కు, లోక్‌స‌భ‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించి వ్య‌యాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌డం.. తద్వారా అభివృద్ధి ప‌నుల‌కు ఆటంకాలు ఏర్ప‌డ‌కుండా చూసుకోవడమనేది ఎన్డీయే ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా ఉంది.

 హ్యాట్రిక్ విజయానికి జమిలి అవసరం

హ్యాట్రిక్ విజయానికి జమిలి అవసరం


జ‌మిలి ఎన్నిక‌ల అంశం ఆలోచ‌న‌ల రూపంలోనే ఉంటోంది. ఇప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌డంలేదు. నిర్ణీత గడువు ప్రకారం 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గాలి. అంత‌కంటే ముందే గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌తంలో ఏ పార్టీ వ‌రుస‌గా మూడుసార్లు విజ‌యం సాధించిన చ‌రిత్ర కూడా లేదు. జ‌మిలి ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకురావ‌డంద్వారా ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ విజ‌యం సాధించాల‌నే రాజ‌కీయ వ్యూహం క‌మ‌ల‌నాథుల్లో ఉంది.

 సిద్ధమైన రోడ్ మ్యాప్?

సిద్ధమైన రోడ్ మ్యాప్?


దేశ‌వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలను ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ జ‌మిలి ఎన్నిక‌ల క‌ల‌ను కూడా సాకారం చేస్తార‌ని ఆ పార్టీనేత‌లు భావిస్తున్నారు. ఏక‌కాలంలో ఎన్నిక‌లు జ‌రిగిన ప‌క్షంలో ల‌బ్ధి పొంద‌గ‌ల‌మ‌ని క‌మ‌ల‌దళం అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికే జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి రోడ్ మ్యాప్ రూపొందించాల్సిందిగా న్యాయ క‌మిష‌న్ ను కోరిన‌ట్లు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు ప్ర‌స్తుత పార్లమెంటు స‌మావేశాల్లో వెల్ల‌డించారు. దీంతో జ‌మిలి ప్ర‌తిపాద‌న మ‌రోసారి మొగ్గ‌తొడిగింది.

రెండుచోట్ల బీజేపీ ఉంటేనే అభివృద్ధి

రెండుచోట్ల బీజేపీ ఉంటేనే అభివృద్ధి


బీజేపీ అధికారం చేప‌ట్టేనాటికే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బ‌లీయంగా రూపుదిద్దుకున్నాయి. ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారన్ని చెలాయిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో త‌ట‌స్థంగా ఉంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ‌పార్టీల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గ‌ట్టి స‌వాల్ ఎదుర‌వుతోంది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన పక్షంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడితే లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీకి ఇబ్బందిక‌ర పరిణామంగా మార‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే జమిలి ఎన్నికల పై కేంద్రం దృష్టి సారించిందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి జమిలి జరిగే విధంగా రోడ్ మ్యాప్ సిద్ధం కాగలదని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+