ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా !

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: రాజ్యసభ్యుడిగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అమిత్ షా గుజరాత్ స్పీకర్ కు లేఖ అధించారు. అమిత్ షా వెంట గుజరాత్ శాసన సభ్యులు స్పీకర్ దగ్గరకు వెళ్లారు.

రాజ్యసభ ఎన్నికలు, డీకేకి ఫోన్ చేసిన అహ్మద్ పటేల్, క్రెడిట్ మొత్తం, గిఫ్ట్ గా హోం శాఖ!

మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అమిత్ షా 46 ఓట్లతో రాజ్యసభ సభ్యుడిగా గెలుపోందారు. రాజ్యసభలో అడుగుపెడుతున్నందున తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని అమిత్ షా మీడియాకు చెప్పారు. గుజరాత్ శాసన సభ్యుడిగా ఉన్న అమిత్ షా మొదటి సారి రాజ్యసభకు ఎన్నిక అయ్యారు.

BJP president Amit Shah resigns to MLA post
Rajya Sabha Elections : After Winning Ahmed Patel's next target is...

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అమిత్ షాను గుజరాత్ బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. గుజరాత్ లోని నారాయణపుర శాసన సభ నియోజక వర్గం నుంచి అమిత్ షా ఎమ్మెల్యేగా గెలిచారు. అమిత్ షా రాజీనామాతో ఇప్పుడు మళ్లీ నారాయణపుర శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP president Amit Shah resigns as MLA from Gujarat's Naranpura after being elected to Rajya Sabha from the state.
Please Wait while comments are loading...