వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో బీజేపీకి ఎదురుగాలి? సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం? అసలేం జరుగుతోంది?

గుజరాత్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదా?...కేంద్రానికి మోడీ వెళ్లిపోయాక గుజరాత్ బీజేపీకి నాయకుడే లేకుండా పోయాడా?... ఇంతకాలం బీజేపీకి అండగా ఉంటున్న పటేళ్లు వచ్చే ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేస్తారా?... అసలు గ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

గుజరాత్‌లో బీజేపీకి ఎదురుగాలి? సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం? | Oneindia Telugu

గుజరాత్: గుజరాత్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదా?...కేంద్రానికి మోడీ వెళ్లిపోయాక గుజరాత్ బీజేపీకి నాయకుడే లేకుండా పోయాడా?... ఇంతకాలం బీజేపీకి అండగా ఉంటున్న పటేళ్లు వచ్చే ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేస్తారా?... అసలు గుజరాత్‌లో ఏం జరుగుతోంది?

గత సార్వత్రిక ఎన్నికల్లోగానీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోగానీ బీజేపీ అధికారంలోకి రాడానికి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఆ సోషల్ మీడియానే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.

సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం?

సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం?

త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఎలా నెగ్గాలో తెలియక అమిత్‌షా సహా బీజేపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వొద్దంటూ గుజరాత్ యువకులకు అమిత్ షా పిలుపునిచ్చారు. గుజరాత్ అభివృద్ధి పిచ్చి ప్రచారం అంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా పేలుతున్న జోకులు, వ్యంగ్యాస్త్రాలు అధికార బీజేపీకి కునుకు పట్టనీయడం లేదు. టైర్లు ఊడిపోయిన బస్సు ఫోటో పెట్టి ‘గుజరాత్ ఆర్టీసీ మాది.... భద్రత మాత్రం మీదే'నంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్ లో కొన్ని జోకులు వెల్లువెత్తాయి. ఇలాంటి జోకులు ఆన్‌లైన్ లో కోకొల్లలుగా షికార్లు చేస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ వ్యంగ్య ప్రచారం...

ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ వ్యంగ్య ప్రచారం...

మరోవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దసరా దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గార్బా వీడియో ఒకదానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీని విమర్శిస్తూ సాగిన రెండున్నర నిమిషాల ఈ వీడియోకు లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. వ్యంగ్య ప్రచారం యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. బీజేపీకి అండగా ఉన్న బలమైన సామాజిక వర్గం పటేదార్లలో నెలకొన్న అసంతృప్తిని తమ వైపు తిప్పుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కొన్ని పటేళ్ల సంఘాలు సైతం బీజేపీ వ్యతిరేక ఆన్‌లైన్ ప్రచారాన్ని మొదలు పెట్టాయి.

విమర్శలకు కాదేదీ అనర్హం...

విమర్శలకు కాదేదీ అనర్హం...

బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి జీఎస్టీ లాంటి జాతీయ అంశాల నుంచి రోడ్లపై గుంతలు వంటి స్థానిక సమస్యల దాకా దేన్నీ కాంగ్రెస్ వదలడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తున్నా పెట్రోల్ ధరలు పెరుగుతుండటం పైనా సెటైర్లు వేస్తూ కొన్ని వీడియోలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆనందిబెన్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పటేదార్ల రిజర్వేషన్ల ఉద్యమం పతాక స్థాయికి చేరింది. దాన్ని అణిచివేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 22 ఏళ్ల ఉద్యమ కెరెటం హార్ధిక్ పటేల్ బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఆయనకు దేశవ్యాప్తంగానూ క్రేజ్ పెరిగిపోయింది.

బీజేపీకి దూరమైన పటేదార్లు...

బీజేపీకి దూరమైన పటేదార్లు...

ఆ తరువాత ఉద్యమంకాస్త చల్లబడినా పటేదార్లలో బీజేపీపై వ్యతిరేకతను మాత్రం భారీగా పెంచింది. ఒకప్పుడు అండగా ఉన్న పెద్ద సామాజిక వర్గం ఇప్పుడు దూరం కావడం ఇప్పుడు బీజేపీకి తీరని నష్టం. గుజరాత్ జనాభాలో 14 శాతం మంది పటేదార్లే. దాంతో వారి ఓటు బ్యాంకు అన్ని పార్టీలకు కీలకంగా మారనుంది. ఇక హార్థిక్ పటేల్ శివసేనలో చేరడం బీజేపీకి గోరుచుట్టుపై రోకలిపోటు. గత లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం మంది పటేళ్లు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేసే ఛాన్సుంది. పటేళ్ల ఆందోళనకు రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే పటేళ్లకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ హామీనివ్వడంతో వారంతా కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు. ఎవరికి ఓటేసినా ఫర్వాలేదుగానీ బీజేపీకి ఓటేయొద్దంటూ పటేళ్లకు ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ పిలుపునిచ్చారు. బీజేపీ తన తండ్రిని నిలబెట్టినా తానుమాత్రం ఓటేయబోనని పేర్కొనడం గమనార్హం.

జాతీయ రాజకీయాల్లో అమిత్ షా బిజీ...

జాతీయ రాజకీయాల్లో అమిత్ షా బిజీ...

దీనికి తోడు వ్యూహకర్తగా ఉన్న అమిత్‌షా కూడా జాతీయ రాజకీయాల వైపు వెళ్లిపోవడం ఆ లోటును మరింత పెంచింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల సమయమే ఉంది. మోడీ తర్వాత అంతటి చరిష్మా ఉన్న నేత మరొకరు లేకపోవడం కూడా బీజేపీకి మైనస్ పాయింటే. ఈ నేపథ్యంలో కమలం పార్టీకి కంచుకోటలా ఉన్న గుజరాత్‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచార సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

గుజరాత్ యూత్ ఇప్పుడు ఎవరివైపు?

గుజరాత్ యూత్ ఇప్పుడు ఎవరివైపు?

గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు బీజేపీ అంటే యూత్ ఊగిపోయేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పడు బీజేపీ అనగానే జోక్స్ వేస్తున్నారు. మోడీ తర్వాత సీఎంగా వచ్చిన ఆనందిబెన్ పటేల్, ప్రస్తుత సీఎం విజయ్ రూపాని ఇద్దరూ కూడా అక్కడి యూత్ ను అంతగా ఆకట్టుకోలేకపోయారు. అమిత్‌షా కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, పటేళ్ల ఆందోళనను పట్టించుకోకపోవడంతో వారంతా అడ్డం తిరుగుతున్నారు. నిజానికి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్‌ బీజేపీకి సరైన నాయకుడే లేకుండా పోయారనే చెప్పాలి.

సొంత రాష్ట్రంలోనే ఓడిపోతే.. ఎలా?

సొంత రాష్ట్రంలోనే ఓడిపోతే.. ఎలా?


నిజానికి గుజరాత్ లో వ్యాపార రంగంలో ఎక్కువగా ఉన్న పటేళ్లు... బీజేపీకి గట్టి మద్దతుదారులు. అయితే రిజర్వేషన్ కల్పించకపోవడంతో ఆ వర్గం రానురాను కాంగ్రెస్‌కు దగ్గరవుతోంది. ఈ విషయమే ఇప్పుడు బీజేపీ అధిష్ఠానాన్ని ఎక్కువగా కలవరపెడుతోంది. బీజేపీకి మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తయితే... గుజరాత్ మరో ఎత్తు. గుజరాత్ లో గెలవడం అమిత్ షా, మోడీకి ప్రిస్టేజ్ ఇష్యూ. సొంత రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోకపోతే వీరిద్దరి ప్రభ దేశ వ్యాప్తంగా తగ్గిపోతుంది.. క్రమంగా ఆ ప్రభావం దేశమంతా పడుతుంది.

రైతులు కూడా బీజేపీకి దూరమేనా?

రైతులు కూడా బీజేపీకి దూరమేనా?

మరోవైపు గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా పెరుగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగా... పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. మరో రెండు మూడు నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ... స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి నిజంగా పెద్ద షాకే. అంతేకాదు, రైతులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నారని అమిత్ షా గుర్తించారు. 20 ఏళ్ల నుంచి గుజరాత్ లో అధికారంలో ఉండటంతో... బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. మోడీ గుజరాత్ ను విడిచి వెళ్లిపోయాక ఈ వ్యతిరేకత రెట్టింపయ్యింది.

ముస్లింల సంగతేంటి?

ముస్లింల సంగతేంటి?

గుజరాత్‌లో పది శాతం మంది ముస్లింలున్నారు. మరో ఆప్షన్ లేకపోవడంతో ముస్లింల్లోనూ 31 శాతం మంది గత ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేశారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారని సమాచారం. 36 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి ముస్లింలు కూడా తమ ప్రభావం చూపనున్నారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ వైబ్రంట్ గా ఉండేది. ఈ మధ్యకాలంలో వృద్ధిరేటు మందగించింది. ప్రధానిగా మోడీ పనితీరు నచ్చకపోయినా గుజరాత్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే ఛాన్సుంది.

అహ్మద్ పటేల్ గెలుపు పెద్ద దెబ్బ...

అహ్మద్ పటేల్ గెలుపు పెద్ద దెబ్బ...

అమిత్ షా, మోడీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక బీజేపీకి గుజరాత్ లో పెద్ద నాయకులు లేరు. అయితే శంకర్ సింఘ్ వాఘేలా వెళ్లిపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే మారింది. రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తే మాత్రం గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభకు వెళ్లకుండా ఎలాగైనా అడ్డుకోవాలని అమిత్ షా ప్లాన్ చేశారు. కేంద్ర మంత్రులను, పార్టీ అగ్రనేతలను మోహరించినా చివరికి అహ్మద్ పటేల్ గుజరాత్ నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది ఎన్నికలకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.

ఇక అగ్రనేతలు రంగంలోకి దిగాల్సిందే...

ఇక అగ్రనేతలు రంగంలోకి దిగాల్సిందే...

వైబ్రంట్ గుజరాత్... గుజరాత్ వెలిగిపోతోందన్న నినాదం ఇప్పుడు పూర్తిగా
రివర్సవుతోంది. అలా అంటే చాలు అక్కడ యూత్ సెటైర్లేస్తున్నారు. నిరుద్యోగం పెరిగిపోతోందంటూ యువకులు రోడ్లెక్కుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరగడంతో స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. పటేళ్ల ఆందోళనను వ్యతిరేకించిన ఓబీసీ నేత ఆల్పోస్ ఠాకూర్ ను సైతం అమిత్ షా దూరం పెట్టాల్సివచ్చింది. కానీ ఈ చర్య వల్ల మళ్లీ ఠాకూర్లు ఎక్కడ తమకు దూరమవుతారోనని బీజేపీ అగ్రనేతలు భయపడుతున్నారు.

సొంత రాష్ట్రంపై దృష్టిసారించిన మోడీ...

సొంత రాష్ట్రంపై దృష్టిసారించిన మోడీ...

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ పై దృష్టి పెట్టారు. నర్మదా సరోవర్ డ్యాంను జాతికి అంకితం చేశారు. జపాన్ ప్రధానిని పిలిచి అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు భారీ ప్రాజెక్టులు గుజరాత్‌కే ఎక్కువ లాభం చేకూర్చేవి. మామూలుగా అయితే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ముంబైలో శంకుస్థాపన చేయొచ్చు కానీ... సొంత రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకే మోడీ అహ్మదాబాద్ ను ఎంచుకున్నారు. ఇదీ రాజకీయ వ్యూహంలో భాగమే. ఎందుకంటే, మహారాష్ట్రలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. అదే గుజరాత్ విషయానికొస్తే.. అక్కడ మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఆఘమేఘాల మీద లక్షా పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి అహ్మదాబాద్ - ముంబై బుల్లెట్ రైలు మార్గానికి శంకుస్థాపన చేయించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు నర్మదా డ్యాం ఎత్తు పెంచేందుకు ఎంత కష్టపడ్డానో వివరించారు. ప్రపంచ బ్యాంకే కాదు అప్పటి యూపీఏ సర్కార్ కూడా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. తనపై ఎన్నో కుట్రలు పన్నారంటూ ఏకంగా ఎలక్షన్ స్పీచ్ ఇచ్చారు మోడీ. ఇక మోడీ పుట్టినరోజున.. ఆయన పేదలు,అణగారిన వర్గాల కోసమే పుట్టారంటూ మరో కొత్త రాగం అందుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.

స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ...

స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ...

మరోవైపు గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ తరపున స్వయంగా తానే చూసుకునేందుకు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ. ద్వారక నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో కౌరవల్లాంటి బీజేపీని రాహుల్ ఓడిస్తారని కాంగ్రెస్ గుజరాత్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోల నిర్వహణతోపాటు రైతులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సభల్ని నిర్వహించనున్నారు.

బీహార్ పైనా కన్నేసిన.. అమిత్ షా!

బీహార్ పైనా కన్నేసిన.. అమిత్ షా!

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బీహార్ పై కూడా కన్నేశారు. బీహార్‌లో మొత్తం 40 లోక్ సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో ఎన్డీఏ 33 చోట్ల గెలుపొందింది. కుల రాజకీయాలకు కేంద్రంలాంటి ఈ రాష్ట్రంలో సగానికిపైగా సీట్లను వదులుకోక తప్పదని అమిత్ షా చేసిన సర్వేలో తేలింది. బీహార్‌లో బీజేపీ కార్యకలాపాలు పెంచాలనుకుంటున్న అమిత్ షాకు ఈ సర్వే ఒక షాక్ ఇచ్చింది. దీంతో బీహార్‌పైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయన నిర్ణయించారు. బీహార్‌లో అంతర్గత సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అమిత్ షా పార్టీ శ్రేణులకు ఆదేశించారు. నవంబర్ మూడు నుంచి ఐదో తేదీ వరకు అమిత్ షా బీహార్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. వెనుకబడ్డ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక స్కీంలు ప్రకటించనున్నారు. యాదవేతర వెనుకబడ్డ కులాలను కూడా షా టార్గెట్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీహార్ లో అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. గతంలో బీజేపీ గెలుచుకున్న 25 సీట్లలో తిరిగి ఆ పార్టీ పోటీ చేయనుంది. ఈ నవంబర్‌లో అమిత్ షా తమ సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్నిప్రకటించనున్నారు.

English summary
Prime Minister Narendra Modi and BJP president Amit Shah are likely to be more involved in Gujarat affairs in the coming months as elections are expected to be held in November. Modi will address Narmada Utsav in Gujarat on September 17, an event to celebrate the completion of the Sardar Sarovar Dam on the river.Fifty-six years after the foundation stone was laid, the Gujarat government on June 17 got permission from the Centre to shut the gates of the controversy-hit structure, marking the “completion” of the project.Modi will also receive Japanese Prime Minister Shinzo Abe in Ahmedabad on September 13 for a series of programmes, including the foundation stone laying of India’s first bullet train project between Ahmedabad and Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X