సొంత పార్టీలో ఎంత జరుగుతోంది, నిన్ననే అంతా ఓకే అనుకున్నారు, అయితే ఇలా ?
బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు, శికారీపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్ర బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బెంగళూరులోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ బీజేపీ నేతలు, పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ గైర్హాజరయ్యారు.
దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉండడంతో బీఎల్ సంతోష్ వర్గం తీవ్ర అసహనం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అని, విజయేంద్రకు పదవి అప్పగించడంతో బీజేపీకి గ్రహణం పట్టినట్లుు అయ్యిందని, ఈ గ్రహణ ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరు కావడం ద్వారా కొత్త అధ్యక్షుడిపై బీజేపీ ముందు వరుస నేతలు తిరుగుబాటు చేశారని ఎద్దేవ చేశారు.

ఈ వేడుకకు జాతీయ నాయకులుగానీ, కర్ణాటక రాష్ట్ర నేతలుగానీ హాజరుకాలేదని, ఇదోక డమ్మి గేమ్ అని కాంగ్రెస్ నాయకులు వ్యంగంగా అంటున్ననారు. బీవై విజయేంద్ర బీజేపీలోనే కేజేపీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు కాదు, ఓడిపోయిన వారి జాబితాను చూస్తుంటే బీఎల్ సంతోష బ్యాచ్ లో చేరేవార సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది.
బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవిని బీవై విజయేంద్రకు అప్పగించినట్లు ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించడంతో బీజేపీలో తీవ్ర ఆగ్రహం, అసహనం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటే బీజేపీలో డైనమైట్ పేలుడు లాగా ఆ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీ నాయకత్వంలో ఇలాంటి తేడాలు ఉంటే కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీవై విజయేంద్ర ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, యడియూరప్పకు అంత్యంత సన్నిహితురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, బీజేపీ ఎంపీలు శివకుమార్ ఉదాసి, మంగళ అంగడి, ప్రతాప్ సింహా, బచ్చేగౌడ, శ్రీనివాస్ ప్రసాద్, అనంత్ కుమార్ హెగ్డే, రాజా అమరేష్ నాయక్, సంగణ్ణ కరడి, మాజ మంత్రులు రమేష్ జారకిహోళి, డాక్టర్ కే సుధాకర్ తదితరులు హాజరుకాకపోవడంతో బీజేపీలో తేడాలు వచ్చాయని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications