జార్ఖండ్ ఎన్నికలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్, సీఎం రఘుబర్ దాస్ ఎక్కడినుంచి అంటే...?

జార్ఖండ్ అసెంబ్లీకి తమ తొలి జాబితాను అధికార బీజేపీ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉండగా 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో 17 మంది ఎస్టీలు కాగా, 21 మంది ఓబీసీలు ఉన్నారు. ఐదు సీట్లు మహిళలకు కేటాయించారు. బీజేపీ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు.

52 స్థానాల్లో తిరిగి 30 మంది సీట్లను దక్కించుకున్నారు. 10 మందికి మాత్రం టికెట్ దక్కలేదు. సీఎం రఘుబర్ దాస్ తూర్పు జంషెడ్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువ.. చక్రధర్ పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

BJP releases first list of 52 candidates for Jharkhand polls

జార్ఖండ్ లో బీజేపీ ఏజేఎస్‌యూ పార్టీతో కలిసి పోటీ చేయాలని అనుకుంటుంది. అయితే వారు 18 స్థానాలు అడగగా.. 10 సీట్లు ఇస్తామని బీజేపీ తెలిపింది. దీంతో వారి మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. జార్కండ్ లో ఐదువిడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. మూడురోజులకు అంటే డిసెంబర్ 23వ తేదీన ఓట్లను లెక్కించి అదేరోజు ఫలితాలను ఎన్నకల సంఘం అధికారులు ప్రకటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+