కోల్‌కత్తాలో బీజేపీ సభా వేదిక ధ్వంసం ..యోగి బహిరంగ సభ రద్దు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది . ఇక తాజాగా కోల్ కతాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దైనట్టు బీజేపీ తెలిపింది. వేదికను ధ్వంసం చేశారని, వేదికను నిర్మించిన వ్యక్తిని కూడా చితకబాదారని తెలిపింది. మరోవైపు, టీఎంసీపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. హింసకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరో వైపు మమతాబెనర్జీ సైతం బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు .
నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని మమతా బెనర్జీ పై బీజేపీ చీఫ్ అమిత్ షా నిప్పులు చెరిగారు .తన రోడ్ షో జరిగితే, ఓడిపోతానన్న భయంతోనే మమతా బెనర్జీ తన నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారని అమిత్ షా ఆరోపించారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ, బీజేపీ ర్యాలీలోకి జొరబడిన టీఎంసీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారని, ఆస్తులను నాశనం చేశారని అన్నారు. తన రోడ్ షోలో మూడు సార్లు టీఎంసీ దాడులు చేసిందని, ఆందోళన చేస్తున్న వారిని అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అమిత్ షా ఆరోపించారు.

ఆమె నిజస్వరూపం ఏంటో నిన్న కోల్ కతాలో జరిగిన ఘటనతో బెంగాల్ వాసులకు తెలిసి వచ్చిందని, ఆమెను ప్రజలు తిరస్కరించే రోజు ఎంతో దూరంలో లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు .ఇక తాజాగా మరోమారు బహిరంగ సభను రద్దు చేసుకునే పరిస్థితి వచ్చిందని మమత సర్కార్ ను బర్తరఫ్ చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ బహిరంగసభ రద్దైనట్టు ప్రకటించిన బీజేపీ పశ్చిమ బెంగాల్ లో ప్రజా స్వామ్యం లేదని ఆరోపించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications