భారత్‌లో ప్రవక్త మ్యూజియం ఏర్పాటు చేయండి: సౌదీ సంస్థను కోరిన బిజెపి నేత
దుబాయ్: ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఉన్న రెండో అతి పెద్ద దేశమైన భారత్‌లో ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త మ్యూజియం ఏర్పాటుచేయాలని ఓ సౌదీ సంస్థను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ కోరారు.
ఇటీవల సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించిన సందర్భంగా మక్కాలో ప్రవక్త జీవిత విశేషాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్, మ్యూజియంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంను ఏర్పాటు చేసిన అస్సలము అలైకా అయ్యుహా అన్నబియ్యు సంస్థను అభినందించారు. మ్యూజియం అద్భుతంగా ఉందని చెప్పారు.

అంతేగాక, భారత్‌లోనూ ఈ మ్యూజియం శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రాజెక్టు జనరల్ సూపర్‌వైజర్ నసీర్ అల్ జహ్‌రానీని షానవాజ్ హుస్సేన్ కోరారు. కాగా, ఆ సౌదీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మరో 20 శాఖలను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలిపింది.
తన పర్యటనలో భాగంగా షానవాజ్ హుస్సేనే.. అక్కడి హజ్ హుస్సేన్ ఆల్ డిప్యూటీ మినిస్టర్ ఆల్ షరీఫ్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారత యాత్రీకుల సంఖ్య కోటాను పెంచాలని కోరారు. మక్కా విస్తరణ పనులు జరుగుతున్న నిరుడు 1,36,000మంది భారతీయ యాత్రికులను మాత్రమే అనుమతించారు. ఆ సంఖ్యను ఈ ఏడాది నుంచి పెంచాలని షానవాజ్ ఆయనను కోరారు.












Click it and Unblock the Notifications