బీజేపీ - శివసేన సీట్ల సర్దుబాటు బెడిసి కొడుతుందా?

తాము కోరిన 144 (126 బీజేపీ, 18 ఇతరులు) స్దానాలను ఇవ్వని పక్షంలో బీజేపీ సొంతంగా అన్ని స్దానాల్లో పోటీకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అహ్మాద్‌నగర్ లోని చొండి పబ్లిక్ ర్యాలీలో వెల్లడించనున్నారు. ఐతే శివసేన స్పందన మరోలా ఉంది. శివసేన ఎంపీ ఒకరు మాట్లాడుతూ శివసేనను అమిత్ షా పూర్తిగా మరచిపోయారు. బీజేపీ ఎందుకంత ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగానే పోటీ చేయమనండి అని పేర్కొన్నారు.
2009లో జరిగిన ఎన్నికల్లో శివసేన 169 సీట్లలో పాల్గోందని, కానీ ఇప్పుడు 150 సీట్లలో పాల్గొనడానికి ఒప్పందం కుదిరినా బీజేపీ ఒప్పుకోవడం లేదన్నారు. మహారాష్ట్రలో శివసేన పెద్ద పార్టీ అన్న విషయాన్ని గమనించాలన్నారు. శివసేన మాత్రం బీజేపీకి 119 సీట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన సీట్లలో ఆ పార్టీ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడంతో పొత్తులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
వచ్చే నెలలో మహారాష్ట్రలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్దానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర శివసేన పెద్ద పార్టీగానూ, బీజేపీ చిన్న పార్టీగానూ పొత్తులో భాగమని శివసేన భావిస్తుంది.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనను కనబర్చడంతో పొత్తుల సమీకరణను మార్చాలని డిమాండ్ చేసింది.
కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, శివసేన చెరో 135 స్థానాల్లో పోటీ చేయాలని, మిగిలిన 18 సీట్లను చిన్న చిన్న పార్టీలకు కేటాయించాలని బీజేపీ వాదిస్తుంది. అయితే గత శనివారం 9 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీకి 119 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని శివసేన స్పష్టం చేస్తుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications