ఇదేం విడ్డూరం: ఎన్నికల కమిషన్ అఫీషియల్ నోట్ పై బీజేపీ స్టాంప్: వై అండ్ హౌ

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య కేరళ బీజేపీ రాష్ట్రశాఖ స్టాంప్ ముద్రతో కూడిన ఎన్నికల కమిషన్ అధికారిక లేఖ వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. రాజకీయ పార్టీలకు పంపిన ఓ అఫిడవిట్ అది. ఎన్నికల సంఘం అధికారిక ముద్రకు బదులుగా బీజేపీ కేరళ యూనిట్ స్టాంప్ దీనిపై ఉండటం వివాదాస్పదమైంది. దీన్ని సీపీఎం ట్విట్ చేసింది. రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందనడానికి ఈ లేఖను నిదర్శనమని విమర్శించింది.

BJP Seal on Election Commission Letter Sparks Firestorm Over the Error Officials Suspend Officer

కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ ఒకే శక్తి కేంద్రం నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తున్నాయని సీపీఎం ఆరోపించింది. కనీసం రెండు వేర్వేరు టేబుల్‌లను అయినా ఏర్పాటు చేసుకోండని చురకలు అంటించింది. ఎన్నికల కమిషన్ లేఖపై బీజేపీ స్టాంప్ ను ఓ సాధారణ తప్పిందంగా భావించకూడదని, ఈసీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి, దానిపై బీజేపీ పెత్తనం చలాయిస్తోందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొంది.

ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా అది కమలం గుర్తుపైనే పడుతోందనే వాదనలు తరచుగా వింటోన్నామని, దాన్ని ఇప్పుడు కళ్లారా చూస్తోన్నామని సీపీఎం ధ్వజమెత్తింది. బీజేపీ- ఈసీ ఒకే ముద్రను ఉపయోగిస్తోండటం రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రక్రియను, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించినట్టేనని మండిపడింది. ఈ వివాదంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఈసీ. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

ఈసీ అధికారులు బీజేపీ కార్యాలయం నుండి పనిచేస్తున్నారా అని నిలదీసింది. ఈసీ అధికారులకు బీజేపీ స్టాంప్ ఎలా అందుబాటులోకి వచ్చిందని ప్రశ్నించింది. ఈసీ లెటర్‌హెడ్‌తో అన్ని ఎన్నికల అధికారులకు బీజేపీ రాసిన లేఖగా పేర్కొంది. దీనిపై కేరళ ఎన్నికల ప్రధానాధికారి మాట్లాడారు. దీన్ని క్లరికల్ ఎర్రర్ గా పేర్కొన్నారు. దాన్ని తక్షణమే సరిదిద్దామని, దీనికి కారణమైన అధికారిని సస్పెండ్ చేశామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+