వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాల్ చల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఝలక్: ఆ ఒక్క కారణం, కసితో కుమ్మెశారు !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls Report On Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఏక పక్షంగా అధికారంలోకి వస్తోందని పీపుల్స్ పల్స్ సర్వేలో స్పష్టం అయ్యింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ ధమాల్ పేరును ప్రకటించిన తరువాత ఈ సర్వే జరిగింది.

బీజేపీదే పై చేయి

బీజేపీదే పై చేయి

అక్టోబర్ 23 నుంచి అదే నెల 30వ తేదీ వరకు 68 శాసన సభ నియోజక వర్గాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో సర్వే జరిగింది. బీజేపీ 39 నుంచి 44 శాసన సభ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తోందని వెలుగు చూసింది.

కాంగ్రెస్ కథ కంచికే

కాంగ్రెస్ కథ కంచికే

కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 శాసన సభ నియోజక వర్గంలో విజయం సాధిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెలుగు చూసింది. హిమాచల్ ప్రదేశ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉందని సర్వేలో వెలుగు చూసిందని వివరించింది.

సీపీఎం ఎంట్రీ !

సీపీఎం ఎంట్రీ !

తొలిసారిగా హిమాచల్‌ ప్రదేశ్ శాసన సభలో సీపీఎంకు చెందిన ఒక ఎమ్మెల్యేతో అడుగుపెట్టే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఇద్దరు నుంచి నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించనున్నారని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రసింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకున్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివస్తోంది. బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సర్వేలో వెల్లడవడం కొసమెరుపు.

సీఎం ఎవరు కావాలంటే !

సీఎం ఎవరు కావాలంటే !

సీఎం ఎవరు కావాలని నిర్వహించిన సర్వేలో బీజేపీ సీఎంగా ధుమాల్ వైపు 34 శాతం, వీరభద్ర సింగ్ వైపు 33 శాతం మంది మొగ్గు చూపారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్దికి ఏ పార్టీ మేలు అంటూ జరిగిన సర్వేలో బీజేపీ వైపు 41.4 శాతం మంది, కాంగ్రెస్ వైపు 37. 5 శాతం మంది మొగ్గు చూపారు.

మూడు శాతం ఓట్లు ముంచేశాయి

మూడు శాతం ఓట్లు ముంచేశాయి


హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం మూడు శాతమే అయినా వీరభద్రసింగ్‌ సర్కార్‌ను కూలదోసి బీజేపీ నేతృత్వంలోని దుమాల్‌కు పట్టం కట్టేలా సీట్లలో భారీ తేడా వస్తుందని తెలిపింది.

ఆ ఒక్క సమస్య కాంగ్రెస్ కు !

ఆ ఒక్క సమస్య కాంగ్రెస్ కు !


హిమాచల్‌ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ వర్సెస్‌ రాహుల్‌ గాంధీగా మారలేదు. జాతీయ నేతల ప్రభావమూ అంతకంటే లేదు. నిరుద్యోగం శాసన సభ ఎన్నికల ప్రధానాంశంగా భావిస్తున్నామని 28.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ధరల పెరుగుదల

ధరల పెరుగుదల

ధరల పెరుగుదలే తమను కలవరపెడుతోందని 21.5 శాతం మంది సర్వేలో చెప్పారు. గిట్టుబాటు ధరలే ప్రధానాంశమని 16 శాతం, రాష్ట్ర అభివృద్ధే కీలకాంశమని 12 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పత్రిపక్షానికే పరిమితం అవుతోందని సర్వేలో వెలుగు చూసింది.

English summary
Himachal registered 74 per cent voter turnout in the single phase polling on November 9. The Congress is currently ruling Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X