భాజపా, శివసేన అవకాశవాద పార్టీలు: సోనియా గాంధీ

న్యూఢిల్లీ; భారతీయ జనతా పార్టీ, శివసేన అవకాశవాద పార్టీలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. మహరాష్ట్రలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో గురువారం కోల్హాపూర్ ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సోనియా గాంధీ మాట్లాడుతూ భాజపా, శివసేన బయటకు విడిపోయినట్లు కనిపించినా ఆ రెండు పార్టీలు అవకాశవాద పార్టీలని పదవి కోసం ఏమైనా చేస్తాయని అన్నారు. ఎన్నికల సమయంలో భాజపా పెద్ద పెద్ద హామీలను చేస్తోందని, ఆ తర్వాత వాటిని మర్చిపోతొందని విమర్శించారు.

పారిశ్రామిక వేత్తల కోసం పనిచేస్తున్న మోడీ: రాహుల్ గాంధీ

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఇచ్చిన హామీలపై ఆమె ప్రశ్నించారు. వంద రోజుల్లో ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గించలేకపోయారని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పాక్ సైన్యం చేస్తున్న కాల్పులను ఎందుకు ఆపడం లేదని సోనియా గాంధీ ప్రధాని మోడీని విమర్శించారు.

BJP spreads hatred in society: Sonia Gandhi

ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకోసం పని చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ కొన్ని అమెరికా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఔషధ ధరలపై నియంత్రణ ఎత్తివేశారని తెలిపారు.

దాని ఫలితంగా 8 వేల రూపాయలకు లభ్యమయ్యే కేన్సర్ ఔషధం లక్ష రూపాయలైపోయిందని ఆయన విమర్శించారు. మధుమేహం ఔషధం ధర కూడా అమాంతం పెరిగిపోయిందని ఆయన తెలిపారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+