బాంబులు విసురుకున్న బీజేపీ, టీఎంసీ: మమతా వల్లే దాడులని
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రోజు రోజుకు వైరం తీవ్రమవుతోంది. తాజాగా, బుధవారం నాడు బీర్భూంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరి పైన మరొకరు దాడులకు పాల్పడ్డారు.
ఒకరి పైన మరొకరు నాటు బాంబులు విసురుకున్నారు. దీంతో స్థానికంగా భయాందోళన పరిస్థితి కనిపించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బీజేపీ, టీఎంసీ కార్యకర్తల తీరుతో బీర్భూం జిల్లా రణరంగమైంది. పశ్చిమబెంగాల్‌లో గత కొన్నాళ్లుగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. బీజేపీ బలపడుతున్న బీర్భూం జిల్లాలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది.
తాజా ఘటన పాధి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇరు వర్గాలు నాటు బాంబులు విసురుకోవడమే కాకుండా ఇళ్లు తగులబెట్టుకున్నారు. క్షతగాత్రుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. నానూర్ ప్రాంతంలోనూ ఘర్షనలు జరిగాయి. పోలీసులు ఘర్షణలను అడ్డుకున్నారు. ఈ ఘర్షణల్లో ఓ గర్భిణి తీవ్రంగా గాయపడింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ అదేశాలతోనే తమపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications