వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంలో ఈ పార్టీదే అధికారం... జోరుగా కొనసాగుతున్న పందాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఇప్పటికే నాలుగు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు విడతలు మిగిలి ఉన్నాయి. జరిగిన ఈ ఎన్నికల సరళిపై అప్పుడే బెట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇంతకీ బెట్టింగ్ రాయుళ్లు ఎవరిపై పందాలు కాస్తున్నారు..? ఎక్కడ పందాలు కాస్తున్నారు..?

వికసించనున్న కమలం

వికసించనున్న కమలం

లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు దశలు ముగిశాయి. ఇక పందెంరాయుళ్లు తమ పనిలో బిజీగా ఉన్నారు. నాలుగు దశల పోలింగ్ సరళిని చూసి చాలామంది కేంద్రంలో తిరిగి అధికారం బీజేపీ చేపడుతుందని పందాలు కాస్తున్నారు. బెట్టింగ్‌లకు పాపులర్ అయిన సత్తా బజార్‌లో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మొత్తం 543 స్థానాలకు గాను 250 స్థానాల్లో కమలం పార్టీ వికసిస్తుందని పందాలు కాస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలకు పరిమితమవుతుందని జోస్యం చెబుతున్నారు. ఇక మిత్రపక్షాలతో కలిసి బీజేపీకి 300 పైచిలుకు స్థానాలు వస్తాయని బెట్టింగ్ బంగార్రాజులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ బీజేపీకి 18 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

 గతంలో కంటే కాంగ్రెస్‌కు కాస్త ఎక్కువ సీట్లు

గతంలో కంటే కాంగ్రెస్‌కు కాస్త ఎక్కువ సీట్లు

కాంగ్రెస్‌కు 76-79 సీట్లు వరకు రావొచ్చని... అది 2014లో పొందిన సీట్ల కంటే చాలా అధికం అని బుక్కీలు చెబుతున్నారు. అయితే మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బుక్కీలు చెప్పారు. తొలి మూడు దశల్లో జరిగిన పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించన మీదట బుక్కీలు ఈ నెంబర్ గేమ్‌ను అంచనావేశారు. మూడుదశల్లో 303 స్థానాలకు పోటీ జరిగింది.

రాష్ట్రాల వారీగా బీజేపీ గెలుపొందే సీట్లు

రాష్ట్రాల వారీగా బీజేపీ గెలుపొందే సీట్లు


ఉత్తర్‌ప్రదేశ్‌లో 41 సీట్లు బీజేపీ విజయం సాధిస్తుందని... మధ్యప్రదేశ్‌లో 20 నుంచి 22 స్థానాలు, గుజరాత్‌లో 22 నుంచి 24, బీహార్‌లో 12 నుంచి 14, పశ్చిమ బెంగాల్‌లో 8 నుంచి 11 సీట్లు, హర్యానాలో 7-9 స్థానాలు, ఢిల్లీలో 5 నుంచి 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశారు. ఇక మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి 31 నుంచి 34 స్థానాల్లో విజయం సాధిస్తుందని బుక్కీలు చెబుతున్నారు. ఇక మెజార్టీ సర్వేలు కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు గుర్తు చేసిన బుక్కీలు... 2019లో కూడా అధికారంలోకి వస్తుందని అయితే మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మొత్తానికి సత్తా బజారులో పందాలు జోరుగా కొనసాగుతున్నాయి.

English summary
With a few weeks left for Lok Sabha election results, the satta bazzar is betting high on Narendra Modi returning to power but believes his influence has waned since 2014, suggested media reports. The betting market expects the Bharatiya Janata Party (BJP) to win up to 250 of the 543 Parliament seats, which is short of majority, as against 77 seats of the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X