వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ 65, అమరీందర్ సింగ్ పార్టీ 37.. కుదిరిన సీట్ల లెక్క.. గెలుపుపై ధీమా

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో సీట్ల లెక్క కుదురుతోంది. పోటీ చేసే స్థానాలపై పార్టీలు స్పష్టతకు వచ్చాయి. బీజేపీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ సీట్లను ప్రకటించాయి. బీజేపీ 65 చోట్ల పోటీ చేయనుంది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 చోట్ల బరిలోకి దిగనుంది. ఎస్ఏడీ సంయుక్త్ 15 చోట్ల పోటీ చేయనుంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎస్ఏడీ సంయుక్త్ చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ ధిండ్సా, అమరీందర్ సింగ్ కలిసి.. పోటీ చేసే స్థానాలను ప్రకటించారు.

కీ రోల్

కీ రోల్


దేశంలో పంజాబ్ రోల్ కీలకం అని నడ్డా అభిప్రాయపడ్డారు. వ్యవసాయంలోనే గాక.. రక్షణ రంగానికి ఆ రాష్ట్ర యువత చేస్తోన్న ధైర్య, సాహసాలను ఈ సందర్భంగా గు్ర్తుచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలని.. కేంద్రంతో.. రాష్ట్రం సత్సంబంధాలు కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఆదివారం 22 నియోజకవర్గాలకు తన అభ్యర్థులను అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక్కడినుంచి అమరీందర్

ఇక్కడినుంచి అమరీందర్


కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా నుంచి పోటీ చేస్తారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటియాలా అర్బన్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన అమరీందర్ సింగ్, తన ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదని, తన గత ప్రభుత్వంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విజయాలపై ఓట్లు వేస్తానని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు, కెప్టెన్ అమరీందర్ సింగ్, "పాటియాలా నుంచి పోటీ చేస్తాను, 300 సంవత్సరాల నా కుటుంబం యొక్క ఇంటిని వదిలి వెళ్ళను. నా స్వంత ప్రభుత్వ విజయాలు, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలపై ఓట్లు అడుగుతానని చెప్పారు.

పట్టు

పట్టు

అమరీందర్ కాంగ్రెస్ పార్టీని వదిలిన తర్వాత, చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అమరీందర్ సింగ్ పంజాబ్‌లోని పాటియాలా అర్బన్ సీటుపై బలమైన పట్టును కలిగి ఉన్నారు. 2002 నుంచి ఈ స్థానం నుండి ఎన్నికల్లో గెలుపొందారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.

Recommended Video

Assembly Elections 2022: Rallies, Road Show లకు EC నో.. | Oneindia Telugu
కూటమిగా

కూటమిగా

సింగ్ మాజీ ప్రత్యర్థులు బీజేపీ మరియు సుఖ్‌దేవ్ సింగ్ ధిండా యొక్క శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.

English summary
BJP will contest 65 seats in Punjab elections while former Chief Minister Amarinder Singh's new party Punjab Lok Congress has got 37.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X