బిజెపివి పగటి కలలు, 70 సీట్లు దాటవు: కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు కలలు కంటున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శనివారం నాడు జరుగుతున్న ఎన్నికల్లో బిజెపికి 60 నుండి 70 సీట్ల కంటే ఎక్కువ రావని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి శనివారం నాడు ఎన్నికలు జరుగుతున్నాయి అధికారాన్ని తిరిగి కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ, దక్షిణాదిలో బిజెపి పాగా వేసేలా చర్యలు తీసుకొంటుంది. ఈ ఎన్నికలను రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్నాయి.

BJP will not win more than 60-70 seats, forget 150: Congress leader Mallikarjun Kharge

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో 60 నుండి 70 సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావని కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బిజెపికి 150 సీట్లు వస్తాయని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి 60 నుండి 70 స్థానాలు కూడ రావని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సిద్దరామయ్య ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని బిజెపి నేత యాడ్యురప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మే 15న వెల్లడి కానున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Mallikarjun Kharge today said that Congress is confident of their win. Kharge also claimed that Bharatiya Janata Party will not be able to secure more than 60-70 seats.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X