వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ గెలుపుతో మార్కెట్లకు 'బిగ్ బూస్ట్': దూసుకెళ్తున్నాయి!..

ఆర్థిక సంస్కరణలకు స్థిరమైన ప్రభుత్వాలు దోహదం చేస్తాయని, తద్వారా మార్కెట్లు ఎక్కువగా లాభపడుతాయని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ఏవిధమైన ప్రభావం చూపుతాయన్న మీమాంస నెలకొంది. ఫలితాలు రావడం.. బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించడంతో స్టాక్ మార్కెట్లు సైతం దూసుకెళ్తున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో ఇన్వెస్టర్లు మార్కెట్లపై విశ్వాసంతో ఉన్నారు.

దీంతో 560పాయింట్ల ఎగబాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 424.95పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం 160పాయింట్ల లాభాల్లో కొనసాగుతూ 9050మార్క్ ను దాటి ట్రేడ్ అవుతోంది. మంగళవారం నాడు ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. 40పైసల లాభంతో 66.20వద్ద ప్రారంభమైంది.

BJP Winning is the big boost for markets

గ్రీన్ బ్యాక్ కరెన్సీతో కొన్నాళ్లు పడిపోయిన రూపాయి విలువ ప్రస్తుతం ఏడాదిలో గరిష్టంగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు రూపాయి వృద్దికి దోహదం చేసినట్లుగా తెలుస్తోంది.

స్థిరమైన ప్రభుత్వ పాలనతో మార్కెట్లు నిలకడ కొనసాగుతూ లాభాల పడుతాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సంస్కరణలకు స్థిరమైన ప్రభుత్వాలు దోహదం చేస్తాయని, తద్వారా మార్కెట్లు ఎక్కువగా లాభపడుతాయని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.

English summary
The markets are likely to head higher in the coming week, with the Bharatiya Janata Party registering a massive win in the key state of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X