బిజెపి నేత రేష్మా పటేల్ అశ్లీల వీడియోలు వైరల్: నిందితుడిపై కేసు నమోదు
గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేశారనే కారణంగా పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.
Recommended Video

శృంగారం తర్వాత అసలు మైనర్ ని భార్య గా చేసుకోవడం ఏంటి ? | Oneindia Telugu
తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రేష్మా ఆరోపించారు. అశ్లీల చిత్రాలను సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ఆరోపించారు. అశ్లీల చిత్రాలను పోస్టుచేసిన యువకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేష్మా గతంలో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ ఘటనపై నిజానిజాలు తేల్చాలని సైబర్ క్రైమ్ అధికారులను కోర్టు అదేశాలు జారీ చేసింది. రేష్మా గతంలో పటీదార్ ఆరక్షణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెపై పటీదార్లు ఆగ్రహంతో ఉన్నారనే ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications