దారుణ హత్య: బిజెపి నేత మృతదేహం లభ్యం
మైసూర్: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సమీపంలోని పెరియపట్నంలో మగిలి రవి అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు హత్యకు గురయ్యారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను వ్యతిరేకిస్తూ చేపట్టిన సమావేశానికి హాజరై బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు.

తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు రవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభమైందని మైసూర్ ఎస్పీ తెలిపారు.
కాగా, కేరళతో పాటు కర్ణాటకలోనూ వరుసబెట్టి ఆర్ఎస్ఎస్, బిజెపి నేతల హత్యలు జరుగుతున్నాయి. ఒక్క కర్ణాటకలో ఇది ఏడవ హత్య. రవి హత్యకు నిరసనగా ఈ నెల ఏడున భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. రవి హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications