బీజేపీ బడా వ్యాపారుల కోసం, అఖిలేష్ మూడేళ్లలో ఎక్కడా కనిపించలేదు: ప్రియాంక సెటైర్లు

రాయ్‌బరేలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాన్య ప్రజలకు సేవ చేయాలనే 'రాజధర్మాన్ని' బీజేపీ మరచిపోయి కేవలం బడా వ్యాపారుల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం ఆరోపించారు.

రాయ్‌బరేలీలోని జగత్‌పూర్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అధికార పార్టీపై కూడా విరుచుకుపడ్డారు, నిరుద్యోగం, రైతులకు సంబంధించిన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారని ఆరోపించారు ప్రియాంక గాంధీ వాద్రా. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)పైనా విమర్శలు ఎక్కుపెట్టారు. గత మూడేళ్లుగా ఎక్కడా కనిపించని అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఓట్లు అడగడానికి బయటకు వచ్చారన్నారు.

 BJP working for big businesses, Akhilesh was nowhere to be seen in past 3 years: Priyanka Gandhi

ప్రజలకు సేవ చేయాలనే మతాన్ని బీజేపీ నేతలు మరచిపోయారు.. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టేందుకే వారికి మతం అవసరంగా మారిందని, ప్రజలకు సేవ చేయాలనే రాజధర్మాన్ని ప్రభుత్వం పాటించడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. కాగా, రాష్ట్రంలో ఫిబ్రవరి 23న జరగనున్న ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోది.

ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతూ... గ్యాస్ సిలిండర్లు, ఆవాల నూనె ధరలు పెరిగాయని ఆమె అన్నారు. మీరు రోజూ రూ. 200 సంపాదిస్తారు, ఆవాల నూనె బాటిల్ రూ. 240 అని అన్నారు. రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగం, రైతుల దుస్థితి గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. 'మతం, కులాన్ని' ఉపయోగించి ఓట్లు రాబట్టుకునే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రియాంక అన్నారు.

రైతులకు చెల్లించాల్సిన డబ్బును పట్టించుకోకుండా కేంద్రం అనవసరంగా ఖర్చు చేసిందని ఆరోపించిన ఆమె.. 'చెరుకు రైతుల బకాయిలు రూ. 14 వేల కోట్లు అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం రూ. 16 వేల కోట్లతో రెండు విమానాలు కొనుగోలు చేసి ప్రపంచాన్ని సందర్శిస్తున్నారు. కానీ రైతులకు బకాయిలు చెల్లించడం లేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసిందని, అయితే ఈ రోజుల్లో పెద్ద వ్యాపారుల రుణాలను మాఫీ చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. కరెంటు రాకపోయినా ప్రతి పరిస్థితిలోనూ ప్రజలు కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మూడు ప్రధాన పథకాలు ఉచిత సిలిండర్, ఉచిత రేషన్, మీ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే కొంత డబ్బు' అని కాంగ్రెస్ నేత ప్రియాంక అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+