ఈసర్వే చూసి కూడా సుమలతకు ఎంపీ సీటు ఇస్తారా ?, యవ్వారం మొత్తం అక్కడే చెడింది, ఏం జరిగింది ?
లోక్ సభ ఎన్నికల్లో ప్రతిసీటు విలువైనదే అనే విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ తో సహ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థి ఎంపికపై నెలకొన్న గందరగోళం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. మండ్య సీటు విషయంలోనే పెద్దతతంగం జరుగుతోంది.
మరో వైపు సిట్టింగ్ ఎంపీ, సినీనటి, తెలుగింటి ఆడపడుచు సుమలత అంబరీష్ మండ్య సీటు నాకే కావాలని ఒంటికాలిపై నిలబడటం కూడా బీజేపీ నాయకులకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. ఒకవైపు బీజేపీ-జేడీఎస్ పొత్తు ప్రకారం మండ్య లోక్ సభ నియోజకవర్గం జేడీఎస్‌కు వెళ్లడం దాదాపు ఖాయమని తెలిసిందే. మరోవైపు మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేయాలని సిట్టింగ్ ఎంపీ సుమలత పట్టుబట్టారు. తన ఎంపీ పదవీకాలం ముగియగానే బీజేపీలో చేరతానని హామీ ఇచ్చిన ఎంపీ సుమలత రాష్ట్ర బీజేపీ నేతలను ఏమాత్రం పట్టించుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

మండ్యలో జేడీఎస్ కు ఎక్కువ ఆధిక్యత ఉన్నందున గెలుపు చాలా సులువు అవుతుందన్న లెక్కలతో బీజేపీ ఆ స్థానాన్ని జేడీఎస్‌కు వదులుకోవాలని నిర్ణయించింది. అయితే ఆ నియోజకవర్గ ఎంపీ సుమలత మాత్రం బీజేపీలో చేరతానని హామీ ఇవ్వడంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సుమలతకు ఓటమి తప్పదని ఇటీవల బీజేపీ నాయకులు జరిపించిన సీక్రేట్ సర్వేలో వెలుగు చూడటంతో ఇప్పుడు అదే బీజేపీలోనే కలకలం రేపుతుంది.
మండ్య లోక్‌సభ టికెట్‌పై పట్టుసాధించాలని సుమలత నేరుగా బీజేపీ హైకమాండ్ నేతలతో సమావేశమై టికెట్ కోసం పట్టుబడుతున్నారు. సుమలతకు టిక్కెట్టు ఇవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్‌లో బీజేపీ హైమాండ్ ఉంటే ఇప్పుడు దిమ్మతిరిగిపోయే మ్యాటర్ బయటకు వచ్చింది మండ్య లోక్ సభ టిక్కెట్ నుంచి సిట్టింగ్ ఎంపీ సుమలతకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం అని దీనిపై సర్వే చేయించిన కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజకీయాల అంతర్గత నాయకులు ఆ నివేదికను బీజేపీ హైమాండ్ కు ఇచ్చారని వెలుగు చూసింది.

కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలను విశ్వాసంలోకి తీసుకున్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు అయోమయంలో పడిపోయిందని తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీయేతర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సుమలత ఏడాది గడిచిన తరువాత బీజేపీ వైపు మొగ్గు చూపారు. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
హైకమాండ్ స్థాయిలో సుమలత బీజేపీ నేతల విశ్వాసాన్ని చూరగొనడంలో విజయం సాధించారు. అదే సమయంలో కర్ణాటకలోని బీజేపీ నేతలను కూడా తమ విశ్వాసంలోకి తీసుకునే చర్యలు సుమలత ఏమాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో కలుస్తున్న సుమలత మండ్య ఎంపీ టిక్కెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు వినహ కర్ణాటక నాయకుడు బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ తదితరులను సుమలత ఇంత వరకు కలవకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
అందుకే మండ్యలో సుమలతకు టికెట్ ఇస్తే ప్రచారం చేసేందుకు కర్ణాటకలోని బీజేపీ నేతలు కలిసి వస్తారా అని బీజేపీ హైకమాండ్ కూడా ఆలోచిస్తోంది. ఇన్ని గందరగోళాల మధ్య మండ్య లోక్ సభ నియోజకవర్గం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే అని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మరో వైపు చెన్నై నుంచ్చిన తరువాత మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మండ్య ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని జేడీఎస్ నాయకులు అంటున్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications