Trisha: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత..! వార్నింగ్ తో దిగొచ్చిన వైనం..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించే క్రమంలో వారితో సినీ ప్రముఖులకు ఉన్న సంబంధాల్ని కూడా తెరపైకి తెచ్చేస్తున్నారు. చివరికి న్యాయపరమైన చర్యల భయంతో తిరిగి వెనక్కి తగ్గుతున్నారు. ఇలాంటిదే తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. నటి త్రిష (trisha)పై చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులో తాజాగా టీవీకే పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న హీరో విజయ్ ను తమవైపు తిప్పుకునేందుకు అధికార డీఎంకే కూటమితో పాటు విపక్షంలో ఉన్న అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే భావజాలం పరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు విజయ్ తేల్చేచెప్పేశారు. దీంతో బీజేపీకి చెందిన నైనార్ నాగేంద్రన్ విజయ్ ను టార్గెట్ చేశారు.

ఇదే క్రమంలో విజయ్ ముందు తన ఇంట్లో నుంచి బయటికి వచ్చి చూడాలని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా త్రిష ఇంట్లో నుంచి బయటికి రావాలన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. త్రిషతో విజయ్ ను లింక్ చేస్తూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇవాళ త్రిష లాయర్ నాగేంద్రన్ కు నోటీసు లాంటి హెచ్చరిక పంపారు. ఆమెను మీ రాజకీయాల్లోకి లాగొద్దని, ఆమెకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం లేదని తేల్చిచెప్పేశారు.

దీంతో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ స్పందించి త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇది పొరపాటున చేసిన ప్రకటన అని, మా పార్టీ అఖిల భారత మహిళా విభాగం చీఫ్ వానతి శ్రీనివాసన్, మరో నేత అన్నామలై దీనిపై తనతో మాట్లాడారని, తన ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లయింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications