పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన బీజేపీ
మరికొద్ది గంటల్లో జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్‌కు మూడు దశల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 మరియు అక్టోబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఇటీవలి ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదైంది.ఆర్టికల్ 370ని 2019 రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్ రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు పాలనను నిర్వచించనున్నాయి.
కాశ్మీర్ జనాభాలో ముస్లింలు 96 శాతానికి పైగా ఉన్నారు.భారతీయ జనతా పార్టీ 2014లో 60 శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌తో 25 సీట్లు గెలుచుకుంది. ప్రత్యేక హోదా రద్దు తర్వాత జరగనున్న ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు పాలనలో శాశ్వత మార్పును చూపుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పోలింగ్‌కు ముందే ఇక్కడ బీజేపీ చేతులెత్తేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 47 స్థానాల్లో ఉండగా, బీజేపీ కేవలం 19 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది. మిగిలిన 28 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించలేదు.దీంతో బీజేపీకి ఆయా నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.లోక్ సభ ఎన్నికల్లో సైతం బీజేపీ కాశ్మీర్‌లో తమ అభ్యర్థులను పోటీకి దించలేదు. జమ్మూలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టి..2 లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు బాగా తగ్గాయి అని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బీజేపీ ఎందుకు పూర్తి స్థాయిలో పోటీ చేయడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. బీజేపీకి ఇక్కడ గెలుపుపై నమ్మకం సన్నగిల్లిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.బీజేపీ నేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి అక్కడి పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి అంత అనుకూలంగా లేవని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ఆరు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి కాశ్మీర్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.












Click it and Unblock the Notifications