వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతే బలితీసుకుంది?: కొడుకుతోపాటు ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై బయటకు వచ్చిన కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌, ఐఏఎస్ అధికారి బీకే బన్సాల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. తన కుమారుడితో కలిసి మధువిహార్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు బన్సాల్.

అక్రమ ఆస్తులు, లంచం తీసుకున్న కేసుల్లో బన్సాల్‌ను గత జులైలో బన్సాల్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ. 9లక్షలు లంచం తీసుకుంటుండగా.. పోలీసులు బన్సాల్‌ను రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు.

BK Bansal commits suicide, former bureaucrat was marred with corruption charges

అనంతరం ఈ కేసులో విచారణ చేపట్టినసీబీఐ అధికారులు బన్సాల్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టగా.. రూ. 60లక్షల నగదు, 20 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 60 బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించారు. దీంతో సీబీఐ అధికారులు అతడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో బన్సాల్‌ అరెస్టుపై తీవ్ర మనస్తాపం చెందిన ఆయన భార్య, కుమార్తె రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఈ కేసులో బన్సాల్‌ గత నెలలో బెయిల్‌పై విడుదలయ్యారు.

తండ్రి అరెస్ట్, తల్లి, సోదరి మృతితో గత కొంతకాలంగా బన్సాల్‌ కుమారుడు డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో బన్సాల్, అతని కుమారుడు తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని కన్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Former bureaucrat BK Bansal, who was out on bail in a corruption case, today committed suicide along with his son, two months after his wife and daughter had hanged themselves for the same reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X