వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు విరోధి-నేడు ట్రబుల్ షూటర్-లఖీంపూర్ మంటలు ఆర్పేందుకు రంగంలోకి రాకేష్ తికాయత్

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావడం చూస్తూనే ఉంటాం. ఒకప్పుడు తామే గొప్పోళ్లమని విర్రవీగుతూ ప్రత్యర్దుల్ని లెక్క చేయని వారికి ఆ ప్రత్యర్ధులే తిరిగి సాయం చేసే పరిస్ధితులు రావడం కూడా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు యూపీలో సరిగ్గా అదే జరుగుతోంది. దాదాపు ఏడాది కాలంగా వ్యవసాయ బిల్లులపై అలుపెరగని పోరాటం చేస్తూ బీజేపీకి చుక్కలు చూపిస్తున్న రైతు నేత రాకేష్ తికాయత్.. ఇప్పుడు యూపీలోని లఖీంపూర్ ఘటనలో కాషాయ పార్టీకి పెద్ద దిక్కుగా మారిపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

లఖీంపూర్ ఖేరీ మంటలు

లఖీంపూర్ ఖేరీ మంటలు

యూపీలోని టెరాయ్ ప్రాంతం పరిధిలోకి వచ్చే లఖీంపూర్ ఖేరీ లోక్ సభ స్ధానంలో తాజాగా రైతు సంఘాల నిరసనలపైకి కేంద్రమంద్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ ఘటనకు బాధ్యుడిగా రైతులతో పాటు విపక్షాలు సైతం ఆరోపిస్తున్న ఆశిష్ మిశ్రాను ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడంతో ఈ వ్యవహారం నానాటికీ ముదురుతోంది. లఖీంపూర్ ఘటనపై స్పందించి మరణిచిన రైతు కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న విపక్ష నేతల్ని అరెస్టులు చేస్తుండటం, అదే సమయంలో ఆశిష్ మిశ్రాను మాత్రం అరెస్టు చేయకపోవడం కలకలం రేపుతోంది.

బీజేపీపై విమర్శల వెల్లువ

బీజేపీపై విమర్శల వెల్లువ


లఖీంపూర్ ఘటనకు కారకుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయకపోగా.. సాకులు చెప్తువ్న పోలీసులపై విమర్శలు పెరుగుతున్నాయి. అసలు ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేంద్రమంత్రి అజయ్ ను సైతం కేంద్రంతో పాటు యూపీలోని యోగీ సర్కార్ వెనకేసుకొస్తుండటంతో వివాదం మరింత మదురుతోంది. బీజేపీ తీరుపై విపక్షాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు నిరసనలు పది నెలలుగా జరుగుతన్నా లఖీంపూర్ తరహాలో ఎక్కడా ఇంత భారీ హింస చోటు చేసుకోవడం విశేషం. అయినా లఖీంపూర్ లో మాత్రం హింసకు ఆజ్యం పోసిన వారిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్నాయి.

 ట్రబుల్ షూటర్ గా రాకేష్ తికాయత్

ట్రబుల్ షూటర్ గా రాకేష్ తికాయత్


పది నెలులుగా కేంద్ర తెచ్చిన వ్యవసాయ బిల్లులపై అలుపెరగని పోరాటం చేస్తున్న భారతీయ కిసాన్ సంఘ్ నేత రాకేష్ తికాయత్ ఇప్పుడు బీజేపీకి ట్రబుల్ షూటర్ గా మారిపోతున్నారు. తాజాగా లఖీంపూర్ ఘటనలో చనిపోయిన రైతుల మృతదేహాలకు అటాప్సీ చేస్తే కానీ అంత్యక్రియలు నిర్వహించబోమని రైతు కుటుంబాలకు భీష్మించాయి. దీంతో ఒక్కో రైతు కుటుంబం వద్దకు వెళ్లి రాకేష్ తికాయత్ వారికి నచ్చజెప్పారు. కేంద్రంపై పోరాటం కొనసాగిద్దామని వారికి భరోసా ఇచ్చారు. తద్వారా ఈ వివాదం మరింత పెద్దది కాకుండా చూసేందుకు తికాయత్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ అహింసా మార్గాల్లో సాగిన తమ ఉద్యమం పైకి బీజేపీ విరుచుకుపడినా ఇప్పుడు ఈ వివాదం నుంచి వారిని రక్షించేందుకు తికాయత్ ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తారు.

మంటలు చల్లార్చేందుకు తికాయత్ ప్రయత్నం

మంటలు చల్లార్చేందుకు తికాయత్ ప్రయత్నం


లఖీంపూర్ లో రైతుల ఆందోళనపైకి బీజేపీ కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ కారు దూసుకెళ్లినట్లు తెలిసినా, అనంతరం నెలకొన్న పరిస్ధితులతో మొత్తం ఉద్యమం దారితప్పే ప్రమాదముందని గ్రహించిన రాకేష్ తికాయత్... ఇప్పుడు పోలీసులతో కలిసి అక్కడ పరిస్ధితుల్ని చక్కదిద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మృతులకు అంత్యక్రియల నిర్వహణతో పాటు పోలీసులతో కలిసి శాంతిని నెలకొల్పేందుకు తికాయత్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. టికాయత్ జోక్యంతో ఇప్పుడు మృతుల కుటుబాలకు రూ.45 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఈ ఘటనపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపించేందుకు యూపీ సర్కార్ అంగీకరించింది. మరణించిన రైతు కుటుంబాలు, ప్రభుత్వం, తికాయత్ మధ్య జరిగిన పలు దఫాల చర్చల తర్వాత ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.

English summary
bku leader rakesh tikait is now playing trouble shooter role in lakhimpur kheri as bjp's troubles deepen with this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X