పాట్నాలో అరవింద్ కేజ్రివాల్‌కు చేదు అనుభవం
పాట్నా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలవడానికి పట్నా వెళ్లారు. ఈ సందర్భంగా పాట్నా విమానాశ్రయంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతుదారులు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు.
కేజ్రీవాల్ హజారేను మోసం చేసారని ఆరోపించారు. నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీశ్ కుమార్‌తో పాటు కేజ్రీవాల్ కూడా పాల్గొని ఒకే వేదికపై ప్రసంగించనున్నారు.
ఇందు కోసమే కేజ్రీవాల్ బీహార్‌కు వచ్చారు. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్.. నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications