వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్విస్ ఖాతాలో వెలుగులోకి 7గురు భారతీయుల పేర్లు, లిస్ట్‌లో యశ్ బిర్లా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యశ్ బిర్లా పేరిట కానీ, ఆయన నియంత్రణలో గానీ ఎలాంటి వ్యక్తిగత అకౌంట్లు స్విస్ బ్యాంకులో లేవని యశ్ బిర్లా గ్రూప్ మంగళవారం నాడు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, స్విస్ ఖాతాల జాబితాలో యశ్ బిర్లా పేరు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన మరో ఐదుగురు భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజిట్‌లో వీరి వివరాలు వెల్లడయ్యాయి. వీరిలో పారిశ్రామికవేత్త యశ్‌ బిర్లా పేరు కూడా ఉంది.

గుర్జీత్‌ సింగ్‌ కొచ్చర్‌, దిల్లీకి చెందిన మహిళా పారిశ్రామికవేత్త రితికా శర్మ, ముంబైలో గొలుసుకట్టు కుంభకోణం సూత్రధారులైన సయీద్‌ మహ్మద్‌ మసూద్‌, చాద్‌ కౌసర్‌ మహ్మద్‌ మసూద్‌ ఉన్నారు. స్విట్జర్లాండ్‌ ఎఫ్‌టీఏ విడుదల చేసిన ఈ గెజిట్‌లో అనేక దేశాలకు చెందిన ఖాతాదారుల పేర్లు వెల్లడయ్యాయి.

Black money probe: Yash Birla has no individual Swiss bank account in his name, says group

భారత్‌కు సంబంధించి స్నేహలతా సాహ్నీ, సంగీతా సాహ్నీల పేర్లు ఇప్పటికే బహిర్గతమయ్యాయి. తాజాగా ఐదుగురి వివరాలు వెలుగు చూశాయి. దీంతో గెజిట్‌లో వెల్లడైన భారతీయుల పేర్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత అధికారులు వీరి గురించి వివరాలు కోరడంతో స్విస్‌ ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.

స్విస్‌ ఖాతాలు కలిగిన కొందరు భారతీయుల పేర్లను స్విట్జర్లాండ్‌ వెల్లడి చేయడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతోషం స్వాగతించారు. విదేశాల్లో అక్రమ సొమ్ము కలిగిన వారిపై తీసుకోబోయే చర్యలకు సంబంధించి ఇది తగిన హెచ్చరికలను చేసి ఉంటుందని అహ్మదాబాద్‌లో చెప్పారు.

English summary
Black money probe: Yash Birla has no individual Swiss bank account in his name, says group
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X