బెంగళూరులో పేలుడు: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు

బెంగళూరు: భారత ఐటీ నగరం బెంగళూరును బాంబు పేలుడు వణికించింది. ఎంజీ రోడ్డుకు అనుబంధంగా ఉన్న చర్చ్‌ స్ట్రీట్ లో ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో భవాని (38) అనే మహిళ మ‌రణించింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతా హై ఎలర్ట్‌ ప్రకటించారు. చర్చ్‌ స్ట్రీట్‌లోని కోకోనట్‌ గ్రోవ్‌ రెస్టారెంట్‌ ముందున్న మొక్కల మధ్య ఈ బాంబు పేలింది.

ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఈడీ) ద్వారా పేలుడు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో అటుపక్కగా నడిచి వెళుతున్న భవాని అనే మహిళ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెతో పాటు కార్తీక్‌ (22), సందీప్‌ (33), మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ భవానీని, మిగిలిన ముగ్గురిని మల్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భవానీ మరణించింది. ఆమె తమిళనాడు రాజధానికి చెన్నైకి చెందిన మహిళ.

Bengaluru blast

బాంబు పేలుడుతో పోలీసులు వెంటనే అప్రమత్తమై డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలను రంగంలోకి దించారు. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ప్రచారకుడు మొహిదీ మస్రూర్‌ బిస్వాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో బాంబు పేలుడు సంభవించిందా? లేక కొత్త సంవత్సరపు వేడుకలకు భయం కలిగించాలనే కోణంలో ఇలాంటి దారుణానికి పాల్పడ్డారా అనేది తెలియరాలేదు. నగరమంతటా రెడ్‌ అలర్ట్‌ విధించినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం.ఎన్‌.రెడ్డి తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే బెంగళూరు వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.

సంఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కర్ణాటక సీఎంను ఫోన్‌లో సంప్రదించారు. సమస్యను ఎదుర్కోవడానికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ సంఘటనా స్థలాన్ని సందర్శించి పోలీసులనడిగి వివరాలు తెలుసుకున్నారు.

Bengaluru blast 1

బెంగళూరు పేలుడు నేపథ్యంలో ఐబీ దేశవ్యాప్తంగా హైఎలర్ట్‌ ప్రకటించింది. ప్రధాన నగరాల్లో భద్రతను పెంచాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందని, జనసమ్మర్థంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవచ్చని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+