లోకల్ రైలులో నాటుబాంబులతో ఇరు వర్గాల మధ్య దాడి
కోల్‌కతా: ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో జరిగిన పేలుడులో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కోల్‌కతాలో గల లోక్‌ల్ ట్రైన్‌లో జరిగింది. రైలు టిటాగఢ్ స్టేషన్ దాటక ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలులో ప్రయాణిస్తున్న రెండు వర్గాలు పరస్పరం కలహించుకొని నాటు బాంబులను విసురుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.

సీల్దా, కృష్ణా నగర్ లోకల్ రైలులో ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామును నాలుగు గంటల ప్రాంతంలో జరిగింది. బాంబుల తీవ్రత స్వల్పమైందేనని, దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
కొంత మంది రైలులో పేలుడు పదార్థాలతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మందితో కూడిన అల్లరి మూక రైలులో ఎక్కిన తర్వాత గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కొంత మంది వద్ద ఆయుధాలున్నట్లు కూడా ప్రయాణికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications