ఢిల్లీలో పేలుడు, ఒకరి మృతి: కారణం ?
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత ఢిల్లీలోని ఓ ప్రసిద్ధి చెందిన మార్కెట్ లో పేలుడు సంభవించింది. చాందీని చౌక్ మార్కెట్ సమీపంలోని నయా బజార్ లో పేరొందిన రద్దీ ప్రాంతంలో పేలుడు సంభవించిందని సమాచారం.
ఈ పేలుడులో ఒకరు మరణించారని, ఐదు మందికి తీవ్రగాయాలైనాయని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి పరుగు తీశారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో టపాసుల గౌడన్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు.

ఓ పెద్ద బ్యాగులో భారీగా టపాసులు తరలిస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని సమాచారం. అయితే పేలుడుకు కారణం ఏమిటి ? ఎలా జరిగింది ? అనే విషయంపై పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.
దీపావళి పండుగ సందర్బంగా పేలుడు జరగడంతో ఢిల్లీ మొత్తం పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. ఫోరెన్సిక్ నిపుణులు, వేలిముద్రల నిపుణులు, స్పెషల్ సెల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications