3 నెలలకోసారి రక్తదానం.. 40 యేళ్ళుగా: సుప్రీం చీఫ్ జస్టిస్ ఖెహర్ గురించి తెలియని నిజం
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు
న్యూ ఢిల్లీ: ఓ వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఓసారి సాదాసీదాగా నడుచుకుంటూ న్యూ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్ ) కు వెళ్లి రక్తదానం చేసి వస్తుంటారు. అది కూడా గత 40 యేళ్ళుగా క్రమం తప్పకుండా చేస్తున్నారు.
ఆ వ్యక్తి ఎవరో కాదు.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు 44వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహర్. ఇది ఇంత వరకు ఎవరికీ తెలియని నిజం.
బుధవారం ఈయన చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జె.ఎస్.ఖెహర్ 1952లో పంజాబ్ లో జన్మించారు.

ఈయన చండీగఢ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం పూర్తి చేశారు. 1999లో పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
2008లో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009లో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2010లో కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2011 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన టీఎస్ ఠాకూర్ పదవీకాలం జనవరి 3తో ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహర్ నేడు బాధ్యతలు చేపట్టారు. ఈయన 2017 ఆగస్టు 28వ తేదీ వరకు ఆ విధుల్లో కొనసాగుతారు.












Click it and Unblock the Notifications