కరోనా క్వారంటైన్ నుంచి 9 మంది పరార్: ఆగురురిని గుర్తించిన పోలీసులు, మిగితావారి కోసం గాలింపు
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ముంబై చెంబూరులోని ఓ హోటల్‌ను క్వారంటైన్‌గా మార్చగా.. అందులో ఉన్న 9 మంది తప్పించుకుని పారిపోయారు. దీంతో ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.
దుబాయ్ నుంచి ఏడుగురు భారత జాతీయులు, కెన్యా నుంచి మరో ఇద్దరు ముంబైకి వచ్చారు. దీంతో వారిని మనస్ రెసిడెన్సీ హోటల్‌లో క్వారంటైన్లో ఉంచారు. ఈ క్రమంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు బీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ హోటల్‌లో ఉన్నవారంతా తప్పించుకుపారిపోయినట్లు గుర్తించారు.

పారిపోయినవారిలో ఆరుగురు పుణెలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వారందరి క్వారంటైన్ పీరియడ్ త్వరలో ముగియనుందని బీఎంసీ అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నారు.
ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ క్లబ్బులు భారీగా జనం గుమిగూడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను పాటించని 15 హోటళ్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 18 రాత్రి నుంచి మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రంలో 36,902 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఇప్పటికే పలు నగరాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కు పెట్టుకోకుంటే రూ. 500 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలను అలసత్వం ప్రదర్శిస్తే లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుతం స్పష్టం చేసింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications