అయ్యో పాపం: బావిలో బయటపడ్డ ఐదుగురు చిన్నారుల మృతదేహాలు

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బర్వానీ జిల్లా చికిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది చిన్నారులు మృతి చెందారు. వారి మృతదేహాలు బావిలో తేలియాడుతూ కనిపించాయి.మృతి చెందిన చిన్నారులంతా మగపిల్లలే కావడం విశేషం. వీరి వయస్సు మూడు నుంచి ఏడేళ్ల మధ్య ఉంటుందని అడిషనల్ ఎస్పీ ఓంకార్ సింగ్ కాలేష్ చెప్పారు. ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు పరారాలో ఉన్నారని కేసును విచారణ చేస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉంటే మృతి చెందిన పిల్లల తండ్రి భరత్ సింగ్ కుటుంబంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆయను ఇద్దరు భార్యలు అని చెప్పారు. బావిలో ఐదుగురు పిల్లల మృతదేహాలు తేలుతూ కనిపించడంతో చికిలి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోకి దూకి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.

Bodies of five minor brothers found in well in MP

మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు మొదటి భార్య సుందరీబాయ్‌కు పుట్టారని మరో అబ్బాయి అనితా బాయ్‌కు పుట్టారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం భరత్ సింగ్ అతని ఇద్దరు భార్యలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+