రేప్: యువతిని చంపేసి కాళ్లు కట్టేశారు, ఛాతీపై రాళ్లు?
బెర్హంపూర్: ఓ యువతి శవం అత్యంత దారుణమైన స్థితిలో బయటపడింది. మరణించిన యువతిని అత్యాచార బాధితురాలిగా అనుమానిస్తున్నారు. ఒడిషాలోని గంజాం జిల్లా బాలిసాహిలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శవం కాళ్లు కట్టేసి, మొహం గడ్డితో కప్పారు.
17 ఏళ్ల యువతి శవాన్ని సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు భంజనగర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ ఆర్‌సి సేథీ చెప్పారు. ఆమె ఛాతీపై రెండు భారీ రాళ్లు పెట్టి ఉన్నాయి. హత్య చేయడానికి ముందు యువతిపై అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పోస్టుమార్టం నివేదికలపై యువతిపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం తేలుతుందని సేథీ చెప్పారు. ఆ బాలిక చదువును మధ్యనే మానేసింది. ఆమె దినసరి కూలీ కూతురు. ఆమె గురువారంనాడు ఆమె తండ్రితో పాటు వరిపొలానికి వెళ్లింది.
ఆమె సాయంత్రం 3 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లింది. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారంనాడు పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications