వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగానదిలో గల్లంతు: 11 రోజుల తర్వాత తేలిన మంత్రి కుమార్తె మృతదేహం

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ప్రమాదవశాత్తు గంగానదిలో కొట్టుకుని వెళ్లిన ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె చివరికి శవమై కనిపించింది. 11 రోజుల తరువాత మంత్రి కుమార్తె మృతదేహాన్ని గుర్తించామని ఉత్తర ప్రదేశ్ పోలీసు అధికారులు అధికారికంగా చెప్పారు.

ఉత్తర ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్ (24) మీరట్ లోని మెడికల్ కాలేజ్ లో మెడిసన్ విద్యాభ్యాసం చేస్తున్నది. అబిదా హసన్ మే 10వ తేదిన స్నేహితులతో కలిసి రుషికేష్ కు విహారయాత్రకు వెళ్లారు.

Body of U.P.Labour Minister’s daughter found after 11 days in Pashulok barrage

తరువాత గంగానదిలో రబ్బరు బోటులో ప్రయాణించారు. ఆ సందర్బంలో బలమైన ప్రవాహం రావడంతో బోటులో
ఉన్న అబిదా హసన్ నదిలో పడి కొట్టుకుని వెళ్లారు. అప్పటి నుండి సహాయక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి. గురువారం పాయురీ జిల్లా లో గాలింపు చర్యలు చేపట్టారు.

జిల్లాలోని పశులాక్ బ్యారేజ్ సమీపంలో అబిదా మృతదేహం గుర్తించామని పాయురీ జిల్లా ఎస్పీ అజయ్ జోషి తెలిపారు.మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని అజయ్ జోషి వివరించారు. మంత్రి షాహిద్ మంజూర్ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.

English summary
Pauri Superintendent of Police (SP) Ajay Joshi said, "The body was in a slightly decomposed state and was found floating near the Pashulok barrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X