కుమార్తె ప్రేమికుడిపై మరిగే నూనె పోసిన తల్లి!

సమాజంలో రోజురోజుకీ ఊహించని నేరాలు జరుగుతున్నాయి. మనుషుల్లో విచక్షణ తగ్గిపోవటం వలన ఇతరులకు ఈజీగా హాని చేస్తున్నారు. సినిమాలు, వెబ్ సీరీస్ లలో జరుగుతున్న క్రైం అను మించిన నేరాలు చేస్తున్నారు. మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అని భయం కలిగే విధంగా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలోని ఉత్తిరంపట్టులో అలాంటి సంఘటనే జరిగింది.

ప్రియురాలి ఇంటికి వెళ్ళిన ప్రియుడు

ఉత్తిరంపట్టు గ్రామానికి చెందిన 36 సంవత్సరాల దమీమ్ అనే మహిళ భర్తను కోల్పోయి కుమారుడు, 18 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. మూడు నెలల క్రితం కావేరిపాక్కంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఏర్పరచుకుంది. ఇదిలా ఉండగా ఒచ్చేరి సమీపంలోని ఆయర్‌పాడి గ్రామానికి చెందిన 19 ఏళ్ళ లోకేష్ ఆమె కుమార్తెను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం లోకేష్ ప్రియురాలి ఇంటికి వెళ్లి దమీమ్‌ను కలిశాడు.

boiling oil attack Mother pours boiling oil on daughter s lover in Ranipet district in tamilnadu

పెళ్లి చేయాలని ప్రియురాలి తల్లిని కోరిన యువకుడిపై మరిగే నూనె దాడి

తన కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. ఈ మాటలు విన్న దమీమ్‌కు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఆమె వంటగదిలోంచి మరుగుతున్న నూనెను తీసుకొచ్చి యువకుడి మీద పోసింది. నూనె పడిన లోకేష్ తీవ్రంగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతన్ని వాలాజాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రేమ వ్యవహారాలపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందిస్తున్న తీరు

ఈ సంఘటన గ్రామంలో ఆందోళన కలిగించింది. ప్రేమ వ్యవహారాలపై తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తెను ప్రేమించాడు అన్న కోపంతో ఆ తల్లి చేసిన పని సమాజాన్ని షాక్ కు గురి చేసింది.

బీజేపీ నుండి కొండా సురేఖకు ఊహించని షాక్.. బీజేపీ డంపింగ్ బిన్ కాదు!
బీజేపీ నుండి కొండా సురేఖకు ఊహించని షాక్.. బీజేపీ డంపింగ్ బిన్ కాదు!

అమానుష చర్య.. మారుతున్న ఆలోచనా ధోరణి

అతను ఇంటికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, ఆమె కూడా మాట్లాడి తన అభిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది, కానీ అలా కాకుండా మరిగే నూనె పోయటం అత్యంత అమానుష చర్య. ఈ పరిస్థితులు మారాలని, ఇలాంటి ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని కోరుకుందాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+