Kiara Advani: వాఘా సరిహద్దులో సందడి చేసిన కియారా అద్వానీ..
బాలీవుడ్ నటి కియారా అద్వానీ వాఘా సరిహద్దులో సందడి చేశారు. ఆమె దేశ సైనికులను సన్మానించారు. అట్టారీ-వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్(BSF) సైనికులతో కొంత సమయం గడిపింది. ఇందుకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్నాయి. వీడియోలో త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ లేత గోధుమరంగు, ఆకుపచ్చ షేడ్స్‌లో అందమైన సల్వార్-సూట్ ధరించారు. దేశంలోని నిజమైన హీరోలతో సమయం గడపడం ఆనందంగా ఉందన్నారు.
ఆమె BSF సైనికులతో కలిసి బూట్ క్యాంప్‌లో సరదా కార్యక్రమాలలో పాల్గొంది. కియారా అక్కడ సైనికులతో కలిసి చెట్లను నాటింది. దీని తర్వాత ఒక రౌండ్ గన్ షూటింగ్ లో పాల్గొంది. అందరితో ఇంటరాక్ట్ అయ్యింది. అనంతరం కియారా ముంబైకి తిరిగి వచ్చింది. అంతకుముందు రోజు, ఆమె విమానాశ్రయంలో వాఘా సరిహద్దులో జరిగిన వేడుకలో ఆమె ధరించిన అదే జాతి దుస్తులనే ధరించింది. టెర్మినల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆమె సెల్ఫీ అభిమానాలు ఎగబడ్డారు.

కియారా చివరిగా కార్తీక్ ఆర్యన్‌తో కలిసి సత్యప్రేమ్ కీ కథలో కనిపించింది. రామ్ చరణ్‌తో పాటు రాబోయే గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారాను అభిమానులు చూడానున్నారు. వీరితో పాటు అంజలి, SJ సూర్య, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఆమె చివరిగా రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామలో కనిపించింది.












Click it and Unblock the Notifications