బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అర్జున్ రాంపాల్ ను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ .. రాంపాల్ ను అరెస్ట్ చేసే ఛాన్స్

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను మరోమారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు ప్రశ్నిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కు సంబంధించి ఏజెన్సీకి సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే నటుడు అర్జున్ రాంపాల్ ను ఎన్‌సిబి అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు . అర్జున్ రాంపాల్ సోమవారం (డిసెంబర్ 21) ఉదయం రెండవ సారి ఎన్‌సిబి విచారణను ఎదుర్కోవటానికి ముంబై కార్యాలయానికి వచ్చారు.

 అర్జున్ రాంపాల్ సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని అనుమానిస్తున్న ఎన్సీబీ

అర్జున్ రాంపాల్ సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని అనుమానిస్తున్న ఎన్సీబీ

కొన్ని మానసిక మందులకు సంబంధించి అర్జున్ రాంపాల్ సమర్పించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని ఎన్‌సిబి అనుమానిస్తున్నట్లు సమాచారం . గత నెలలో ఏజెన్సీ నిర్వహించిన దాడిలో నటుడి నివాసంలోకొన్ని డ్రగ్స్ దొరికాయి. నవంబర్ 13 న, అర్జున్ రాంపాల్ తన ఇంట్లో దొరికిన డ్రగ్స్ మానసిక రుగ్మత కోసం డాక్టర్ సూచించిన మెడిసిన్స్ అని ఎన్‌సిబికి అర్జున్ రాంపాల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు . అదే ప్రిస్క్రిప్షన్‌కు సంబంధించి అర్జున్ రాంపాల్‌ను ఎన్‌సిబి పిలిపించింది.

ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటున్న అర్జున్ రాంపాల్ .. అరెస్ట్ కు అవకాశం

ఎన్సీబీ విచారణ ఎదుర్కొంటున్న అర్జున్ రాంపాల్ .. అరెస్ట్ కు అవకాశం

డిసెంబర్ 15 న అర్జున్ రాంపాల్ కు మరోమారు సమన్లు పంపించిన ఎన్సీబీ డిసెంబర్ 16 న రాంపాల్ ఏజెన్సీ ముందు హాజరు కావాలని కోరారు. అయినప్పటికీ, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ వారి ముందు హాజరు కావడానికి ఒక వారం సమయం కోరారు అర్జున్ రాం పాల్ . అర్జున్ రాంపాల్ అందించిన ప్రిస్క్రిప్షన్ నకిలీ అని తేలితే, నటుడు తన అరెస్టును కూడా ఎదుర్కోవలసి ఉంటుందని సమాచారం . ఎందుకంటే అతని ఇంట్లో దొరికిన డ్రగ్స్ ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం షెడ్యూల్ చేయబడిన డ్రగ్స్ కావటంతో ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నకిలీది అయితే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు .

ఇంట్లో దొరికిన డ్రగ్స్ కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ .. నకిలీ అని తేలితే అరెస్ట్

ఇంట్లో దొరికిన డ్రగ్స్ కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ .. నకిలీ అని తేలితే అరెస్ట్

అలాగే, అర్జున్ రాంపాల్ ఢిల్లీకి చెందిన ఒక వైద్యుడి నుండి స్నేహితుడి ద్వారా ప్రిస్క్రిప్షన్ పొందాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి . అంతేకాక, ప్రిస్క్రిప్షన్ బ్యాక్‌డేటెడ్ ప్రిస్క్రిప్షన్‌ను తయారు చేసినందుకు అరెస్టును ఎదుర్కోవలసి ఉంటుంది. నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై దాడి చేసిన తరువాత, అర్జున్ రాంపాల్ యొక్క గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను కూడా ఎన్‌సిబి రెండుసార్లు ప్రశ్నించింది. ఆమె సోదరుడు అగిసియాలోస్ డెమెట్రియేడ్స్‌ను ఎన్‌సిబి రెండు కేసుల్లో అరెస్టు చేసింది . ఇటీవల బెయిల్‌పై అగిసియాలోస్ విడుదల అయ్యాడు .

ఆ డ్రగ్స్ డాక్టర్ వాడమన్నారని ప్రిస్క్రిప్షన్ , తనకు డ్రగ్స్ తో సంబంధం లేదన్న అర్జున్ రాంపాల్

ఆ డ్రగ్స్ డాక్టర్ వాడమన్నారని ప్రిస్క్రిప్షన్ , తనకు డ్రగ్స్ తో సంబంధం లేదన్న అర్జున్ రాంపాల్

మీడియాతో మాట్లాడుతూ అర్జున్ రాంపాల్ తనకు ఎలాంటి డ్రగ్స్ లేదా డ్రగ్ పెడ్లర్లతో సంబంధం లేదని, విచారణ ఏజెన్సీతో సహకరిస్తున్నానని చెప్పాడు. అతను తన నివాసంలో దొరికిన మాత్రలు తనకు డాక్టర్స్ సూచించిన మేరకే వాడుతున్నానని. ప్రిస్క్రిప్షన్‌ను సమర్పించానని కూడా పేర్కొన్నాడు. నిషేధిత మాదకద్రవ్యాల మందులైన హషీష్ మరియు అల్ప్రజోలం మాత్రలను ఎన్‌సిబి అతని నుండి స్వాధీనం చేసుకుంది.వాటి విషయంలోనే ఆయన వైద్యుని సూచన మేరకు వాటిని వాడుతున్నట్టు చెప్పారు .

Recommended Video

    Adipurush : Case Filed On Adipurush Star Saif Ali Khan, Om Raut
     ఎన్‌సిబి ఇన్వెస్టిగేషన్‌లో అర్జున్ పేరు ఎలా వచ్చిందంటే

    ఎన్‌సిబి ఇన్వెస్టిగేషన్‌లో అర్జున్ పేరు ఎలా వచ్చిందంటే

    గాబ్రియెల్లా సోదరుడు అగిసియాలోస్‌ను మరో మాదకద్రవ్యాల కేసులో ఏజెన్సీ అరెస్టు చేసిన తరువాత ఎన్‌సిబి దర్యాప్తులో అర్జున్ రాంపాల్ మరియు గాబ్రియెల్లా పేరు వచ్చింది. నిషేధిత మాదకద్రవ్యాలైన హషీష్ మరియు అల్ప్రజోలం మాత్రలను ఎన్‌సిబి అతని నుండి స్వాధీనం చేసుకుంది. ముంబైలో కొకైన్ సరఫరా చేసినందుకు అరెస్టయిన నైజీరియా జాతీయుడు ఒమేగా గాడ్విన్‌తో అగిసియోలోస్ సంప్రదింపులు జరిపాడు. ఒసిగా గాడ్విన్ ఎన్‌సిబి అధికారుల ముందు పేరు అగిసియాలోస్‌ పేరు చెప్పటంతో అగిసియాలోస్ ను అరెస్టు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+