బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. పలు కోణాల నుండి పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు బాలీవుడ్ కు సంబంధించిన ముగ్గురు టాప్ హీరోల పేర్లు ఈ డ్రగ్స్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది.

రియా చక్రవర్తి చాటింగ్ తో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత రియా చక్రవర్తి వద్ద వాట్సప్ చాట్ లో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గరనుండి బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సంబంధాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ కేసులో రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ జయసాహాలను విచారణ జరిపిన నార్కోటిక్స్ అధికారులకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చాయి.

దీపికా, రకుల్, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ లను విచారించిన నార్కోటిక్స్ బృందం
దర్యాప్తులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ లను నార్కోటిక్స్ అధికారులు విచారించారు. వీరే కాకుండా క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కి సంబంధించిన మధు మంతెన, కరిష్మా ప్రకాష్ , నిర్మాత క్షితిజ్ ప్రసాద్ తదితరులను విచారించారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో మరి కొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నట్లుగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
అయితే తాజాగా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ కి సంబంధించిన ఉన్నతస్థాయి ప్రముఖులు ముగ్గురు ఉన్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

వెలుగులోకి మరో ముగ్గురు టాప్ హీరోలు .. వారంతా దీపికాతో కలిసి నటించిన వారే
ఈ ముగ్గురిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిఘా పెట్టిందని సమాచారం. బాలీవుడ్ లో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోలకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేయబోతోందని తెలుస్తోంది. ఎస్, ఆర్, ఏ అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న బిగ్ స్టార్స్ కు కూడా డ్రగ్స్ కు సంబంధం ఉందని చెబుతున్నారు .ఈ ముగ్గురు స్టార్స్ దీపికా పదుకొనేతో కలిసి నటించిన వారేనని బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇటీవల ఈ కేసులో అరెస్టు అయిన నిర్మాత క్షితిజ్ ప్రసాద్ ఈ ముగ్గురి పేర్లను దర్యాప్తులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు వెల్లడించినట్లుగా సమాచారం.

ఎన్‌సిబికి మరో 50 పేర్లను వెల్లడించిన డ్రగ్ పెడలర్ కరంజీత్
ఈ కేసులో అరెస్టు చేసిన డ్రగ్ పెడ్లర్ కరంజీత్ విచారణ సమయంలో ఎన్‌సిబికి 50 పేర్లను వెల్లడించాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు టాప్ స్టార్స్ పై ఎన్‌సిబి దృష్టి సారించిందని, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి వారి పాత్రపై ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.రాబోయే 15 రోజుల్లో ఆ ముగ్గురు టాప్ స్టార్స్ ను ఎన్‌సిబి విచారణ నిమిత్తం తెలుస్తుందని సమాచారం. డ్రగ్ పెడలర్ కరంజీత్ ను విచారించిన నార్కోటిక్స్ డ్రగ్స్ పెడ్లర్ల ఫోన్‌లను స్వాధీనం చేసుకుని వారి ఫోన్ల నుండి సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడింది.
Recommended Video

దర్యాప్తును సమీక్షిస్తున్న ఎన్సీబీ చీఫ్ రాకేశ్ ఆస్థానా
ఇదిలావుండగా, దర్యాప్తును సమీక్షించడానికి ఎన్‌సిబి చీఫ్ రాకేశ్ ఆస్థానా కూడా కొద్ది రోజుల క్రితం ముంబై చేరుకున్నారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ, ముంబై బృందాలతో ఆయన సమావేశంలో పాల్గొన్నారు.
డ్రగ్స్ దర్యాప్తుకు సంబంధించి ఇప్పటివరకు 20 మందిని అరెస్టులు చేయగా, 35 మందిని ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు అయిన నటి రియా చక్రవర్తి కూడా అతని మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications