అస్సాం-మిజోరాం మధ్య సరిహద్దు వివాదం ఎప్పటిది..? చరిత్ర ఏం చెబుతోంది..?
సోమవారం రోజున ఈశాన్య భారతంలో అలజడి చెలరేగింది. అస్సాం-మిజోరాం రాష్ట్రాల సరిహద్దులో భూవివాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ హింస చెలరేగింది. ఇరు రాష్ట్రాలు రాళ్లు రువ్వుకున్నాయి, పోలీసులు కాల్పులు జరపడంతో కొందరు తీవ్రంగా గాయపడగా ఒకరిద్దరు మృతి చెందారు. రైతుల గుడిసెలను తగలబెట్టడం జరిగింది.. ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంస మయ్యాయి. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. బ్రిటీషు కాలం నుంచే ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇంతకీ ఏంటీ వివాదం ఇప్పుడు ఎందుకు తిరగబెట్టింది..?

జూన్ నెలలో తాజా వివాదం
అస్సాం- మిజోరాం సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. ఇది బ్రిటీషు కాలం నుంచే ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య జూన్ నెల నుంచే తాజా వివాదం నడుస్తోంది. ఐత్లాంగ్హనార్ అనే ప్రాంతంను అస్సాం తమ అధీనంలోకి తీసుకుంది. అస్సాం భూభాగమైన ఆ ప్రాంతంను మిజోరాం ఆక్రమించుకుందంటూ ఆరోపించింది అస్సాం. ఇక మిజోరాంలోని మూడు జిల్లాలు అంటే ఐజ్వాల్, కొలాసిబ్, మమిత్‌లు అస్సాంలోని కాచర్, కరీంగంజ్, హైలకంది జిల్లాలతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. జూన్ 30వ తేదీన కొలాసిబ్ జిల్లాకు సమీపంలోని సరిహద్దు దాటి అస్సాం తమ రాష్ట్ర భూభాగంలోకి అక్రమంగా చొరబడిందని మిజోరాం ఆరోపణలు చేసింది. అయితే మిజోరాం రాష్ట్రమే అస్సాంలోని హైలకంది జిల్లాలోకి 10 కిలోమీటర్ల మేరా అక్రమంగా చొరబడి అక్కడ అరటి చెట్లు, వక్కపొడి చెట్లను నాటిందని అస్సాం రాష్ట్ర అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. ఇక అస్సాం పోలీసులు మిజోరాంలోని కొలాసిబ్ జిల్లాలోకి వచ్చి క్యాంపు వేశారని కొలాసిబ్ జిల్లా ఎస్పీ వాన్లాల్ ఫకా రాల్టే చెప్పారు.

ఒకరిపై ఒకరు ఆరోపణలు
అస్సాం అధికారులు క్యాంపు వేసిన ప్రాంతం స్థానికంగా ఐత్లాంగ్హనార్ అని పిలుస్తారు. ఇది ఐత్లాంగ్ నది సమీపంలో ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం మిజోరాంకు చెందుతుందని ఇది కొలాసిబ్ జిల్లాలోని వేరెంగ్తే గ్రామం కిందకు వస్తుందని మిజోరాం చెబుతోంది. ఈ గ్రామం అస్సాం సరిహద్దులో ఉంటుందని మిజోరాం చెబుతోంది. అయితే అస్సాం వాదన ఇందుకు భిన్నంగా ఉంది. మిజోరాం రాష్ట్రమే అస్సాం భూభాగంలోకి అడుగుపెట్టి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆ తర్వాత అది కాస్త అగ్గిరాజుకోవడంతో వివాదం మరింత వేడిని పెంచింది. దీంతో హింస చెలరేగింది.

బ్రిటీషు కాలంలో ఏం జరిగింది
వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదంకు బీజం బ్రిటీషు కాలంలోనే పడింది. అంతకుముందు అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య వివాదాలు చాలా తక్కువగా ఉండేవి. అస్సాం - నాగాలాండ్ నివాసితుల మధ్య చోటుచేసుకున్న వివాదాల కంటే చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుతం అస్సాం మిజోరాం రాష్ట్రాల మధ్య సరిహద్దు 165 కిలో మీటర్ల మేరా ఉంది.ఒకప్పుడు మిజోరాంను లుషాయ్ హిల్స్ అని పిలిచేవారు. అప్పుడు ఇది అస్సాం రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉండేది. అయితే 1857లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం లుషాయ్ హిల్స్‌ను కాచర్ ప్రాంతం నుంచి వేరుపడింది. ఆ తర్వాత 1933లో లుషాయ్ హిల్స్ మణిపూర్‌ల మధ్య ఓ సరిహద్దును తీసుకొస్తూ మరో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు మిజోరాం వాసులు అంగీకరించలేదు.

స్వాతంత్ర్యం తర్వాత ఈశాన్య రాష్ట్రాల ఏర్పాటు
ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈశాన్య భారతంలో క్రమంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాగాలాండ్(1963), అరుణాచల్ ప్రదేశ్ (1972) , మేఘాలయా (1972) మిజోరాం (1972)రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అయితే మిజోరాం అస్సాం రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉమ్మడి సరిహద్దు వద్ద స్టేటస్‌కో మెయిన్‌టెయిన్ చేయాలని నిర్ణయించాయి. అయితే 2018 ఫిబ్రవరిలో మిజో జిర్లాయ్ పాల్ అనే విద్యార్థి సంఘం మిజోరాం రైతుల కోసం అస్సాం భూభాగంలో ఒక రెస్ట్ హౌస్ నిర్మించారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అస్సాం పోలీసులు దాన్ని కూల్చివేశారు. అయితే గతేడాది అక్టోబర్‌లో ఒకే వారంలో రెండు సార్లు హింస చెలరేగింది. అస్సాంలోని లైలాపూర్‌ో ఓ నిర్మాణం చేపట్టడంతో మిజోరాం భగ్గుమంది. అది తమ భూభాగం అని వాదించింది.

హిమంత బిశ్వ శర్మ-జోరంతంగా ఏం చెబుతున్నారు..?
ప్రస్తుతం పరిస్థితి మాత్రం కాస్త హింసాత్మకంగానే కనిపిస్తోంది. అస్సాం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందంటూ మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా అమిత్ షాకు అదే సమయంలో ప్రధాని కార్యాలయంకు ట్వీట్ చేశారు. కొందరు ఆందోళనకారులు కర్రలు పట్టుకుని మిజోరాం భూభాగంలోకి రావడం, అస్సాం పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ చార్జ్‌లకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే మిజోరాం స్థానికులే రాళ్లు రువ్వుతున్నారంటూ అస్సాం పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇటు అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, అటు మిజోరాం సీఎం జోరాంతంగాలు కేంద్రాన్ని కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications