బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Border: పక్క రాష్ట్రంతో పంచాయితీలు. కర్ణాటకలో హై అలర్ట్, సీఎం క్లారిటీ, అమిత్ షా, నడ్డాతో చర్చలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పక్క రాష్ట్రంతో సరిహద్దు వివాదంలో మా జాగ్రత్తల్లో మేము ఉన్నామని, రాష్ట్రం మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఇప్పటికే డీజీపీకి, సంబంధిత పోలీసు అధికారులకు, హోమ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. గురువారం బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. మహారాష్ణ-కర్ణాటకలోని బెళగావి జిల్లా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం బసవరాజ్ బోమ్మయ్ అసహనం వ్యక్తం చేశారు.

Lady teacher: పగలు పిల్లలకు పాఠాలు, రాత్రి బాయ్ ఫ్రెండ్స్ కు ?, మేడమ్ భర్త ?, కేసు రీఓపెన్ !Lady teacher: పగలు పిల్లలకు పాఠాలు, రాత్రి బాయ్ ఫ్రెండ్స్ కు ?, మేడమ్ భర్త ?, కేసు రీఓపెన్ !

 ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నీచరాజకీయాలు

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నీచరాజకీయాలు


ప్రజలు శాంతియుతంగా ఉండాలని మేము పదేపదే మనవి చేస్తున్నామని. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ఇలాంటి సమయంలో రాజకీయం చెయ్యడం మంచిది కాదని బసవరాజ్ బోమ్మయ్ సూచించారు.

అమిత్ షా, నడ్డాతో చర్చలు

అమిత్ షా, నడ్డాతో చర్చలు

మహారాష్ట్ర పంచాయితీ విషయంలో ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డాతో ఫోన్ లో మాట్లాడానని, బెళగావి విషయంలో మా వైఖరి స్పష్టంగా చెప్పామని బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యిందని, కచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని బసవరాజో బోమ్మయ్ అన్నారు.

 అంతరాష్ట్ర బస్సు సర్వీసులు

అంతరాష్ట్ర బస్సు సర్వీసులు

ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో మాట్లాడి రెండు రాష్ట్రల ప్రజలు శాంతియుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చర్చించామని గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని, త్వరలో చర్చలు ద్వారా పరిష్కారం చిక్కుతందని ఆశిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

కర్ణాటకలో హై అలర్ట్

కర్ణాటకలో హై అలర్ట్

మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో బెళగావి జిల్లాలో, ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, మా జాగ్రత్తల్లో మేము ఉన్నామని, రాష్ట్రం మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఇప్పటికే డీజీపీ ప్రవీణ్ సూద్ తో పాటు సంబంధిత పోలీసు అధికారులకు, హోమ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

English summary
Border: State policy on border dispute clearly announced, says Karnataka CM Basavaraj Bommai in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X