"భారత్ లో కలవనున్న పాకిస్థాన్ లోని ఆ రాష్ట్రం..?"

పాకిస్థాన్ విషయంలో రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతం ఇప్పుడు భారత్ ది కాకపోవచ్చు.. కానీ సరిహద్దులు మారతాయి.. సింధ్ రాష్ట్రం మళ్లీ భారత్ లోకి వచ్చే అవకాశం ఉంది.. అని తెలిపారు. ముఖ్యంగా ఎల్ కే అద్వానీ జెనరేషన్ వాళ్లు సింధ్ ప్రావిన్స్ పాకిస్థాన్ కు వెళ్లడాన్ని అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అద్వానీ.. తన బుక్ లో రాసారని పేర్కొన్నారు. 1947 లో భారత్- పాకిస్థాన్ విడిపోయిన నేపథ్యంలో ఇండస్ నది వద్ద ఉన్న సింధ్ ప్రాంతం పాకిస్థాన్ కు వెళ్లింది.

'ఇండస్ నదిని హిందువులు పవిత్రమైన నదిగా పూజిస్తారు. సింధ్ లోని చాలామంది ముస్లింలు కూడా ఈ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు. మక్కాలోని ఆబ్- ఈ- జంజాం నదితో ఇండస్ నదిని పోల్చుతారు'.. అని అద్వానీ తన పుస్తకంలో రాసుకున్న వాఖ్యాలను రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించారు. 'ఈ రోజు సింధ్ ప్రాంతం.. భారత్ లో భాగం కాకపోవచ్చు. కానీ నాగరికత ప్రకారం సింధ్ ఎప్పటికీ భారత్ లో భాగమే. సరిహద్దులు మారతాయి. ఎవరికి తెలుసు.. రేపు సింధ్ మళ్లీ భారత్ లో కలవచ్చు. ఇండస్ నదిని పవిత్రంగా కాపాడుతున్న సింధ్ లోని ప్రజలు ఎప్పటికీ మనవాళ్లే. వాళ్ల ఎక్కడున్నా.. మనవాళ్లే'.. అని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 22 న మొరాకోలోని ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎలాంటి దాడులు, యుద్ధం లేకుండానే భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) ను స్వాధీనం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పీఓకేలోని ప్రజలు స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పీఓకే ఎప్పటికీ మనదేనన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పీఓకే లోని టెర్రర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను ధ్వంసం చేసింది. అదే సమయంలో పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకోవాలని నినాదాలు వచ్చిన విషయం తెలిసిందే.

Borders Can Shift Rajnath Singh Hints Sindh Could Return to India Someday

ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను హతమార్చారు టెర్రరిస్టులు. దీంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. వందల మంది ఉగ్రమూకలను హతమార్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+