• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దారుణం: జూనియర్‌ను చితక బాదిన సీనియర్లు...బాలుడి మృతదేహాన్ని దాచిన స్కూలు యాజమాన్యం

|

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు కొట్టి చంపేశారు. అయితే తమ స్కూలుకు చెడ్డ పేరు వస్తుందన్న కారణంగా జూనియర్ విద్యార్థి మృతదేహాన్ని స్కూలు యాజమాన్యం స్కూలు క్యాంపస్‌లోనే దాచేసింది. ఇంతకీ ఆ జూనియర్ విద్యార్థిని సీనియర్లు ఎందుకు హత్యచేశారు..? వారిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా...?

నాకు బాంబులు వేయడం తెలుసు..ప్రాణాలు తీస్తా: జర్నలిస్టుపై బాలయ్య విసుర్లు

బిస్కెట్ ప్యాకెట్ దొంగలించాడని....

బిస్కెట్ ప్యాకెట్ దొంగలించాడని....

ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలోని మిషనరీ స్కూలు అది. అందులో ఏడవ తరగతి చదువుతున్నాడు ఓ విద్యార్థి. అతను మీరట్‌కు చెందిన వాడు. అదే స్కూలులో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే స్కూలు క్యాంపస్ నుంచి అనుమతి లేకుండా ఎవరూ బయటకు వెళ్లరాదని స్కూలు యాజమాన్యం పిల్లలకు హుకూం జారీచేసింది. అంతకుముందు రోజు ఈ ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఓషాపు నుంచి బిస్కెట్ ప్యాకెట్ దొంగలించాడని ఆ దుకాణం యజమాని స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో స్కూలు యాజమాన్యం పిల్లలను ఎవరినీ అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఆదేశించింది.

విద్యార్థిని చితక బాదిన సీనియర్లు

విద్యార్థిని చితక బాదిన సీనియర్లు

ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి వల్లే తాము బయటకు వెళ్లడం సాధ్యపడటం లేదన్న కోపం సీనియర్ విద్యార్థుల్లో పెరిగింది. జూనియర్ విద్యార్థిని పట్టుకుని కొన్ని గంటలపాటు చితకబాదారు సీనియర్ విద్యార్థులు. స్కూలు బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ముఖంపై చల్ల నీళ్లు చల్లి క్రికెట్ బ్యాట్లతో చితకబాదారు. ఆ తర్వాత స్టడీ రూంలో ఆ అబ్బాయిని పడేసి వెళ్లిపోయారు సీనియర్ విద్యార్థులు. ఇక సాయంత్రం సమయంలో బాధితుడు వార్డెన్ కంటపడ్డాడు. మిగతా విద్యార్థులతో కూర్చుని ఉండగా ఒక్కసారిగా వామిటింగ్ చేశాడు. దీంతో వార్డెన్ ఇతరులు ఆ అబ్బాయిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స చేస్తుండగానే అబ్బాయి మృతి చెందాడు. ఫుడ్ పాయిజన్‌తో అబ్బాయి మృతి చెందాడని డాక్టర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక అబ్బాయి మృతి చెందాడని స్కూలు యాజమాన్యం అబ్బాయి తల్లిదండ్రులకు తెలిపింది. మార్చి 11వ తేదీన డెహ్రాడూన్‌కు విద్యార్థి తండ్రి చేరుకున్నాడు. విద్యార్థి తీసుకున్న ఆహారం విషపూరితం కావడంతోనే మృతి చెందాడని వైద్యులు, స్కూలు యాజమాన్యం తెలిపింది.

స్కూలు క్యాంపస్‌లోనే మృతదేహాన్ని పూడ్చిన యాజమాన్యం

స్కూలు క్యాంపస్‌లోనే మృతదేహాన్ని పూడ్చిన యాజమాన్యం

ఇక మార్చి 23న విద్యార్థి పోస్టు మార్టం నివేదిక వచ్చింది. అసలు సంగతి బయటపడింది. విద్యార్థిని చితకబాదటం, అంతర్గతంగా పెద్ద గాయాలు అవడంతోనే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు చదువులేని వారు కావడంతో స్కూలు యాజమాన్యం వారితో కొన్ని పత్రాలపై వేలిముద్రలు తీసుకుంది. ఆ తర్వాత విద్యార్థి మృతదేహంను స్కూలు క్యాంపస్‌లోనే అంటే మార్చి 11వ తేదీనే పూడ్చిపెట్టింది స్కూలు యాజమాన్యం. తన కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో అక్కడి స్థానికులను ఆశ్రయించాడు తండ్రి. అనంతరం రాష్ట్ర బాలల సంరక్షణ శాఖ అధికారుల వద్దకు స్థానికులు విషయాన్ని చేరవేశారు. వారు వచ్చి మృతదేహంను వెలికి తీసి పోస్టు మార్టంకు పంపారు. దీంతో అసలు విషయం బయటపడింది.

 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ఇక రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మృతదేహంను దాచినందుకు గాను స్కూలు మేనేజర్ ప్రవీణ్ మెస్సి, పీటీఐ టీచర్ అశోక్ సలోమోన్, హాస్టల్ వార్డెన్ అజయ్ కుమార్‌లను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే స్కూలు ప్రిన్సిపాల్ మాత్రం ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. తనకు హాస్టల్‌తో సంబంధం లేదని అబ్బాయి హాస్టల్‌లో మృతి చెందాడనే వాదన వినిపిస్తున్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 12-year-old student of a missionary school was battered to death by two of his seniors in Ranipokhri area of Uttarakhand’s Dehradun district after he allegedly stole a packet of biscuits from a shop, police have said.The incident happened on March 10 and the school authorities buried the Class 7 student inside the school campus on March 11 after his father said he will not be able to take his son’s body home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more