దారుణం : 13 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి ఘాతుకం, రేప్‌ను ప్రతిఘటించిందని..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఓ 16 ఏళ్ల బాలుడు అత్యచారం చేయబోయాడు. దాన్ని ఆ బాలిక ప్రతిఘటించగా ఆగ్రహం పట్టలేక ఆమెను సజీవ దహనం చేసేందుకు తెగించాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజ్‌గఢ్ జిల్లాలోని సుస్తానీ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత బాలిక ప్రస్తుతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

దళిత వర్గానికి చెందిన ఓ బాలిక(13) ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన నిందితుడు తొలుత ఆమెపై అత్యాచారానికి పూనుకున్నాడు. ఆ బాలిక పెద్దగా అరుస్తూ అతడ్ని ప్రతిఘటించడంతో కోపం వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడ్నించి పరారయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధిత బాలికను శనివారం రాత్రి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరం 50 శాతం కాలిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజ్‌గఢ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆదివారం రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications