గర్ల్ ఫ్రెండ్‌ను ఎత్తుకెళ్లి రూ. 70 వేలకు అమ్మేశాడు
రాంపూర్: ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికకరమైన సంఘటన జరిగింది. మిత్రులతో కలిసి గర్ల్ ఫ్రెండ్‌ను కిడ్నాప్ ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. దానికి తోడు వేలం పాటలో ఆమెను రూ. 70 వేలకు అమ్మేశాడు. సంభల్ పరిధిలోని బాదాన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మరో ఇద్దరితో కలిసి 9వ తరగతి చదువుతున్న తన స్నేహితురాలిని కిడ్నాప్ చేశాడు.
ఆ బాలికను ప్రధాన్ గ్రామానికి తీసుకెళ్ళి ఓ ఇంట్లో నిర్భందించాడు. నాలుగు రోజుల తర్వాత వేలం పాటలో 70 వేలకు అమ్మేశాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఓ సమాచారం ఆధారంగా ఆమెను నిర్భంధించిన ప్రధాన గ్రామంలోని ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు. అయితే ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
జాతీయ మీడియాలో ఈ మేరకు గురువారం వార్తలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును రాంపూర్ జిల్లాకు బదలాయించారు.












Click it and Unblock the Notifications