ఇలా చేస్తే కచ్చితంగా సినిమా చూస్తా.. చపాక్ వివాదంపై కనిమొళి.. జేఎన్‌యూలో ఐషేకు పరామర్శ
జేఎన్‌యూలో విద్యార్థులపై పాశవిక దాడికి పాల్పడిన వాళ్లపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, ఇది ఒక్క జేఎన్‌యూపై జరిగిన దాడి కాదని, దేశంలో విద్యావ్యవస్థను, విద్యాలయాల్ని ధ్వంసం చేయాడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని జేఎన్‌యూకు వచ్చిన ఆమె.. వర్సిటీ స్డూడెంట్ లీడర్ ఐషే ఘోష్ ను, దాడిలో గాయపడ్డ ఇతర విద్యార్థులనూ పరామర్శించారు.
జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన నటి దీపిక పదుకొనెకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టిన బీజేపీ.. ఆమె నటించిన 'చపాక్'సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ వివాదంపై కనిమొళి ఘాటుగా స్పందించారు. ''నిజానికి నేను హిందీ సినిమాలు పెద్దగా చూడను. కేవలం విద్యార్థులకు మద్దతు తెలిపిందన్న కారణంతో దీపిక సినిమాల్ని బహిష్కరిద్దామని ప్రచారం చేస్తే గనుక నేను కచ్చితంగా సినిమా చూస్తా. ఆమెకు మద్దతుగా నిలబడతా''అని కనిమొళి చెప్పారు.

జేఎన్‌యూ హింసాకాండను ఖండించిన రాజకీయ పార్టీల్లో డీఎంకే కూడా ఒకటి. పార్టీ చీఫ్ స్టాలిన్ ఆదేశాల మేరకే కనిమొళి జేఎన్‌యూకు వెళ్లి, స్టూడెంట్లను పరామర్శించినట్లు తెలిసింది. అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా జేఎన్‌యూకు వెళ్లిన గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications